మార్చ్ 19న “ఓ మంచి రోజు చూసి చెప్తా

విజయ్ సేతుపతి, నిహారిక కొణిదెల జంటగా ఆరుముగా కుమార్ దర్శకత్వంలో విడుదలై విజయవంతం అయినా తమిళ చిత్రం “ఓరు నల్ల నాల్ పాతు సోలరెన్”. మరి ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగులో “ఓ మంచి రోజు చూసి చెప్తా చిత్రాన్ని మార్చి 19న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. శ్రీమతి రావూరి అల్లికేశ్వరి సమర్పణలో అపోలో ప్రొడక్షన్స్ పతాకం పై డాక్టర్ రావూరి వెంకటస్వామి ఈ చిత్రం తెలుగు హాక్కులను భారి ధరకి సొంతం చేస్తున్నారు. ఈ చిత్రానికి “ఓ మంచి రోజు చూసి చెప్తా” అనే పేరుతో మార్చ్ 19న విడుదల చేస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత డాక్టర్ రావూరి వెంకటస్వామి మాట్లాడుతూ “ఓ మంచి రోజు చూసి చెప్తా” చిత్రం తమిళం లో మంచి విజయం సాధించింది. విజయ్ సేతుపతి అద్భుత‌ నటన ఈ చిత్రానికే ఒక హై లైట్. విలక్షణ నటనతో ప్రేక్షకులని అలరిస్తాడు. ఇక నిహారిక కొణిదెల పెళ్లైన త‌రువాత తెలుగులో విడుద‌ల‌వుతున్న తొలి చ‌త్రం ఇది. నిహారిక అద్భుత‌మైన పెర్ఫామెన్స్ ఈ చిత్రంలో మ‌రో హైలెట్.‌ ఎప్పుడు చేయని పాత్రలో కనిపిస్తారు. ఇది ఒక మాస్ యాక్షన్ ఎంటర్టైనర్. తెలుగు ప్రేక్షకులకి ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ చిత్రాన్ని మార్చ్ 19 న భారీగా విడుదల చేస్తున్నాము” అని తెలిపారు.

(Visited 20 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *