ఓటర్ల నమోదుకు రాజకీయ పార్టీలు సహకరించాలి : జిల్లా రెవెన్యూ అధికారి పి. వెంకటరమణ

అనకాపల్లి,

సాధారణ ఎన్నికలు, శాసన మండలి ఎన్నికల కు సంబంధించి ఓటర్ల జాబితా లో అర్హులైన ప్రతి ఒక్క ఓటరు నమోదయ్యేలా రాజకీయ పార్టీలు తమ వంతు సహకారం అందించాలని జిల్లా రెవెన్యూ అధికారి పి.వెంకట రమణ కోరారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో ఆయన ఓటర్ల జాబితా తయారీ విషయమై జిల్లాలోని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. నవంబర్ 19వ తేదీ నాటికి బూత్ లెవెల్ అధికారులకు ఓటర్ నమోదు దరఖాస్తు ఇవ్వాలన్నారు. డిసెంబర్ 26 నాటికి క్షుణ్ణంగా దర్యాప్తు చేసి తుది జాబితా సిద్ధం చేస్తారన్నారు. జనవరి 5వ తేదీ నాటికి తుది జాబితా ప్రకటించడం జరుగుతుందన్నారు. జిల్లాలో పోలింగ్ కేంద్రాల సంఖ్య పెరగటం లేదని యథాతథంగా ఉంటుందని చెప్పారు. మూడు పోలింగ్ కేంద్రాలు మాడుగుల లో (175 నెంబర్) ఒకటి లంక వాని పాలెం ఎంపీపీ స్కూల్ భవనం పాడై నందున పక్కనే ఉన్న అంగన్వాడీ కేంద్రానికి, అనకాపల్లి నియోజకవర్గంలో( 195, 196) 2 భవనాలు కళ్యాణ మండపం లో ఉన్న రెండింటినీ జీవీఎంసీ ఎలిమెంటరీ స్కూల్ కస్పా వీధిలోనికి మార్చడం జరిగిందని చెప్పారు.
బూత్ లెవల్ ఏజెంట్లను నియమించడానికి జిల్లాలో ఒక పార్టీ ప్రతినిధి కి పార్టీ రాష్ట్ర స్థాయి నుండి ఆథరైజేషన్ ఇవ్వాలన్నారు.
ఉమ్మడి విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో గల 6 జిల్లాలకు సంబంధించి పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలకు కూడా ఓటర్ల జాబితా తయారు చేస్తున్నట్లు తెలిపారు. 10 +2+3 పూర్తి చేసిన వారు ఎవరైనా ఈ ఎన్నికల్లో ఓటింగ్ కు అర్హులేనని చెప్పారు. ఈ జాబితా తయారీకి కూడా అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలన్నారు. ఎక్కువ మంది ఓటర్లు నమోదు లక్ష్యంగా పెట్టుకున్నామని అయితే మూకుమ్మడి దరఖాస్తులు స్వీకరించడం జరగదని స్పష్టం చేశారు.

సమావేశంలో పి. నరసింగరావు, (వైసిపి,) బొలిశెట్టి శ్రీనివాసరావు (తెలుగుదేశం), గంటా శ్రీరామ్ (సిపిఐ ఎం) టి.రమణ (కాంగ్రెస్) డి. పరమేశ్వరరావు, వీ.రమేష్ (బిజెపి), వై ఎన్ భద్రం (సిపిఐ), కొణతాల హరనాథ బాబు (ఆమ్ ఆద్మీ పార్టీ) ప్రతినిధులు, ఎలక్షన్ సెక్షన్ సూపరిండెంట్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

(Visited 29 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published.