నీటి వృథా ప‌ట్టదా?


మాడుగుల : మాడుగుల మండలం కస్పా జగన్నాథ‌పురం సచివాలయం లో చాలా చోట్ల మంచి నీటి కొళాయి లకు బిరడాలు లేని పరిస్థితి. దీంతో ప్రతి రోజు మంచి నీరు వృధాగా పోతుంది. స్థానిక సచివాలయ అధికారులు నిత్యం ప్రజల మద్య ఉంటు ఈ దృశ్యాలను చూసినా తమకు పట్టనట్లు వ్యవహరించడం వారి నిర్లక్ష్యానికి అద్దం పడుతుంది. స్థానిక ప్రజలు అధికారుల దృష్టికి తీసుకు వచ్చిన స్పందించడం లేదని కిషోర్ అనే స్థానికుడు వీ డ్రీమ్స్ ముందు ఆవేదనను వెల్లగక్కాడు.దీనికి తోడు మేజర్ పంచాయతి కావడం వల్ల గ్రామంలో పారిశుధ్యం అస్తవ్యస్తంగా ఉంది. ఏ వీధిలో చూసిన చెత్తా చెదారాలతో దర్షణమిస్తున్నాయ్యి. సచివాలయ పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు సక్రమంగా ఇవ్వకపోవడంతో కార్మికులు పారిశుధ్య పనులపై శ్రధ చూపటం లేదని విమర్శలు విపిస్తున్నాయి.అలాగే గ్రామంలో ఎక్కువగా ప్లాస్టిక్ వ్యర్థాలు దర్షనమిస్తున్నాయి.

ప్లాస్టిక్ వ్యర్దాల వల్ల వచ్చే అనార్దాల పై అధికారులు అవగాహనలు కల్పించకపోవడంతో ఇక్కడి ప్రజలు ప్రతీ కార్యక్రమాలలో ను ప్లాస్టిక్ వస్తువులను వినియోగిస్తున్నారు. ముఖ్యంగా ఈ గ్రామ ప్రజల నిర్లక్ష్యం కారణంగా కాలుష్యాన్ని కొని తెచ్చు కుంటున్నారు. మురికి కాలువ ల్లో ప్లాస్టిక్ వ్యర్దాలతో దర్షన మిస్తున్నాయి.వీ డ్రీమ్స్ ఈ గ్రామాన్ని సందర్శించినప్పుడు అనేక సమస్యలు కంటికి కనిపించాయి.ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామంలో పారిశుధ్యం మెరుగు పరచి మంచినీటి కొళాయి లకు బిరడాలు ఏర్పాటు చెయ్యాలని గ్రామస్థులు కోరుతున్నారు.

    కిషోర్                                                                                                                                 -విల్లూరి రామ‌చంద్ర‌రావు, VDREAMS ప్ర‌తినిధి

(Visited 94 times, 2 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *