నీటి ఎద్దడి నివారణకు చర్యలు : సర్పంచ్ పుష్పలత

(అల్లూరి సీతారామరాజు జిల్లా)

చింతపల్లి :

వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని మంచి నీటి ఎద్దడి నివారణకు తగు జాగ్రత్తలు చేపట్టామని

స్థానిక సర్పంచ్ దురియా పుష్పలత అన్నారు. మంగళవారం పంచాయతీ పరిధిలోని కందులగాది గ్రామంలో సర్పంచ్ అభ్యర్థన మేరకు పాడేరు శాసనసభ్యులు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి నిధుల నుంచి రూ.1.20 లక్షలతో బోరు బావి నిర్మాణ పనులు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామ శివారులో ఉన్న ఊటగడ్డల నుంచి కలుషితమైన మంచినీటిని సేవించి త్రాగడం వలన అనేక రకాల రోగాల బారిన పడి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆమె గుర్తు చేశారు. ఈ బోరు బావి వలన సుమారు 105 కుటుంబాలకు ఉపయోగకరమన్నారు. ఈ బోరు బావిని ప్రతి ఒక్కరు పరిశుభ్రంగా ఉంచుకోని, సద్వినియోగం చేసుకోవాలని ఆమె నిర్ణయించుకుంది.

(Visited 5 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *