ఆక్సిజన్ సరఫరా లో ఎందుకీ వ్యత్యాసం

కోవిడ్ రోగులకు ఆక్సిజన్ సరఫరా లో రాష్ట్రాల మధ్య వ్యత్యాసం ఎందుకు అని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రజా సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ బొట్టా చిన్నియాదవ్ ప్రశ్నించారు. అధిక కేసులతో సతమతమవుతున్న ఆంధ్రాకు మొదట 450 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరా చేశారని, తర్వాత 590 కి పెంచారని, తక్కువ కేసులున్న తెలంగాణకు మొదటగా 690 మెట్రిక్ టన్నుల సరఫరా చేయడం ఏమిటని యాదవ్ ఆవేదన వ్య‌క్తం చేశారు. గురువారం ఆయ‌న ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ఆంధ్రాలో ఆక్సిజన్ అందక సుమారు 76 మంది మృతి చెందిన విషయం ఈ సందర్భంగా యాదవ్ గుర్తు చేశారు, విశాఖ స్టీల్ ప్లాంట్లో ఉత్పత్తి అయిన ఆక్సిజన్ ను మహారాష్ట్రకు పంపించకుండా ఆంధ్ర కే సరఫరా చేస్తే ఆక్సిజన్ అందక ఇంత మంది మృతి చెందే వారు కాదని యాదవ్ విచారణ వ్యక్తపరిచారు, కేంద్రం నుంచి తగినంత రెమిడీస్ వీర్, ఆక్సిజన్ ఆంధ్రాకి అందటం లేదని, ఇప్పటికైనా ఆంధ్ర రాష్ట్ర నాయకులు తేరుకుని కేంద్రం నుంచి అధిక సంఖ్యలో ఆక్సిజన్ సరఫరా అయ్యేవిధంగా కృషి చేయవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము అని చిన్ని యాదవ్ తెలిపారు.

(Visited 117 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *