గెలిపించండి..పేదలకు సేవ చేస్తాం
మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ
అనకాపల్లి : జీవీఎంసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఆదరించి, తమ పార్టీ అభ్యర్థులను, మేయర్ స్థానాన్ని గెలిపిస్తే కొండ కొప్పాక,సిరసపల్లి,సత్యనారాయణ పురంలో నిర్మించిన టిడ్కో గృహాలను డిడిలు కట్టిన స్థానికులకే ఇస్తామని మాజీ శాసనసభ్యులు, నియోజకవర్గ ఇంచార్జ్ “శ్రీ పీలా గోవింద సత్యనారాయణ అన్నారు.టీడీపీ హయాంలో కట్టిన టిడ్కో గృహాలను”వైకాపా నాయకులు దోచుకునే కుట్ర చేస్తున్నారని” ఆరోపించారు. పెంచిన ఆస్తిపన్ను ను రద్దు చేస్తామని,”పాత బకాయిలను మాఫీ చేస్తామని”ఆయన హామీ ఇచ్చారు.పేద వారి కడుపు నిండడం ఇష్టం లేకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నా “క్యాంటీన్లను మూసివేశారాని” ఆరోపించారు.ఈ రోజు 84వ వార్డు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి “మాదంశెట్టి చిన తల్లమ్మ కు మద్దతుగా “కొత్తూరు నరసింగ రావు పేట లో జరిగిన మహిళా సంఘాల ఆత్మీయ సమావేశంలో” ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన పార్టీ నాయకులతో కలిసి పార్టీ ప్రవేశపెట్టిన” 10సూత్రాల ఎన్నికల మ్యానిఫెస్టోను” ప్రవేశపెట్టారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు సిరసపల్లి సన్యాసిరావు, మాజీ సర్పంచులు కసిరెడ్డి సత్యనారాయణ,కొప్పాక బాబు రావు, మిర్తిపటి గోపాల రావు, జాజిమొగ్గల అప్పల రాజు, వల్లి, అక్కిరెడ్డి రమణ బాబు, తదితరులు పాల్గొన్నారు.