రాష్ట్రంలో మహిళలను కించపరిచేలా వైసిపి ప్రభుత్వం : రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మహిళా ఉప అధ్యక్షురాలు కొణతాల రత్న కుమారి
అనకాపల్లి :
రాష్ట్రంలో మహిళలను కించపరిచే విధంగా వైసిపి ప్రభుత్వం వ్యవహరిస్తుందని అనకాపల్లి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శ్రీమతి కొణతాల రత్న కుమారి అన్నారు. బుధవారం అనకాపల్లి పట్టణం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇటీవల భీమవరం, నర్సాపురం లలో ముఖ్యమంత్రి సభకు వచ్చిన మహిళల నల్ల చున్నీలను తీసి వెయ్యాలని అధికారులు వ్యవహరించిన తీరు దుర్మార్గపు చర్యలు అని ఆమె పేర్కొన్నారు. ఈ వైసిపి ప్రభుత్వం లో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని అన్నారు. మహిళల ఓట్లతో గెలిచిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా చేసారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో మహిళలు వైసిపి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తారని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సుకుల రమణమ్మ, జిల్లా కోశాధికారి పోతుల రవణమ్మ,జిల్లా మహిళ కార్యదర్శి వేదులు సూర్య ప్రభ, రాంబిల్లి మండల పార్టీ అధ్యక్షురాలు కొఠారి ధనలక్ష్మి, జిల్లా మహిళ
సత్యవతి, యర్రంశెట్టి ఈశ్వరి తదితరులు పాల్గొన్నారు.