ఎన్నిక‌లు అప‌హాస్యం చేసిన వైసీపీ

ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికలలో రాష్ట్ర వ్యాప్తంగా వైసిపి ప్రభుత్వం మంత్రులు శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు పోలీసు యంత్రాంగం రాష్ట్ర ఎన్నికల కమిషన్ అందరూ కలిసి ఎన్నికలను అపహాస్యం చేశారని మాజీ శాసన మండలి అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం బుద్ధ నాగ జగదీశ్వరరావు విమర్శించారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రజలు వినియోగించుకునే అవకాశం లేకుండా ఇతర రాష్ట్రాల నుండి దొంగ ఓటర్లను బస్సులు అంబులెన్సులు మినీ వ్యాన్ లు వినియోగించి డబ్బులు వెదజల్లి ఓటర్లను భయభ్రాంతులను చేసి పోలింగ్ స్టేషన్ కి రాకుండా దొంగ ఓట్లతో విజయం సాధించి ప్రజలు మా వెంటే ఉన్నారని ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నారని నాగ జగదీష్ మండిపడ్డారు. గురువారం ఈ ఏమేర‌కు మీడియా స‌మావేశం నిర్వ‌హించారు

ఎన్నికలు జరిగిన ఓటింగ్ సరళిని పరిశీలించినట్లయితే శాసనసభ ఎన్నికలకు మున్సిపల్ ఎన్నికలు మార్చి 2021 జరిగిన ఎన్నికలకు నవంబర్ మున్సిపల్ ఎన్నికలకు ఓటింగ్ శాతం లో పరిశీలించినట్లయితే తెలుగుదేశం పార్టీకి మార్చిలో జరిగిన ఎన్నికల్లో 30.13 శాతం నవంబర్ జరిగిన ఎన్నికల్లో 40.96 శాతం ఓట్లు 10.83 శాతం ఓట్లు ఎక్కువ రావడం జరిగిందని అలాగే సీట్లు శాతం పరిశీలించినట్లయితే తెలుగుదేశం పార్టీకి మార్చిలో జరిగిన 12.72 శాతం నవంబర్ లో 26.94 శాతంతో 14.22 శాతం పెరిగాయని నాగ జగదీష్ తెలిపారు.ఎన్నికలు స్వేచ్ఛగా సజావుగా ప్రజాస్వామ్యబద్ధంగా జరిగి ఉంటే దాదాపు అన్ని చోట్ల తెలుగుదేశం జై కేతన ఎగిరి ఉండేదని నాగ జగదీష్ అన్నారు. ఉత్తరాంధ్ర సామంతరాజు విజయ్ సాయి రెడ్డి తెలుగుదేశం పార్టీ కనుమరుగవుతుందని అసలు ఉనికే లేదని పగటి కలలు కంటున్నారని నిన్న మొన్న అధికారంలోకి వచ్చిన వైసీపీకి రాష్ట్రంలో అసలు సభ్యత్వం లేవని గ్రామ కమిటీ లేవని అటువంటిది తెలుగుదేశం పార్టీ కి 70 లక్షల మంది కార్యకర్తలు సభ్యత్వం వున్నాయని 40 సంవత్సరాలుగా గ్రామ కమిటీలు తో ఎన్నికల నియమావళి ప్రకారం ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించి కమిటీలను ఏర్పాటు చేస్తున్న ఏకైక పార్టీ ఏదైనా ఉంటే అది తెలుగుదేశం మాత్రమేనని జగదీష్ తెలిపారు.

ఆరు నెలల వ్యవధిలో ఇంత భారీ స్థాయిలో తెలుగుదేశం సీట్లు ఓట్లు పెరగడం వైసీపీ కి పెద్ద దెబ్బ జగన్ రెడ్డి పెరుగుతున్న ప్రజావ్యతిరేకత అద్దం పడుతుందని ఈ పెద్ద బొక్క లెక్క పెట్టుకోవడానికి కుప్పం బూటక ఫలితాన్ని చూపి వైసీపీ నాయకులు జబ్బలు చరుచుకుంటున్నారని ఏ ప్రభుత్వానికైనా చివరి సంవత్సరంలో వ్యతిరేకత వస్తుందని కానీ జగన్ రెడ్డి ప్రభుత్వానికి రెండున్నర సంవత్సరాల్లోనే భారీ స్థాయిలో వ్యతిరేకత పెరిగి తెలుగుదేశం పార్టీ ఓటింగ్ శాతం పెరిగిందని చంద్రబాబు విశ్వనీయత పట్ల ఆయన నాయకత్వం పట్ల ప్రజల ఆకాంక్ష పెరుగుతుందని ఈ ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయని ఈ ఎన్నికల్లో ప్రజల్లోనూ తెలుగుదేశం కార్యకర్తలు లోను వైసిపి దౌర్జన్యాలు పట్ల తిరుగుబాటు స్పష్టంగా కనబడుతుందని ఇది రానున్న జనరల్ ఎన్నికల నాటికి తారాస్థాయికి చేరడాన్ని ఈ దుష్ట శక్తులు అడ్డుకోలేదని నాగ జగదీష్ జోస్యం చెప్పారు విలేకర్ల సమావేశంలో తెలుగుదేశం నాయకులు కొణతాల వెంకటరావు బొడ్డేడ జోగినాయుడు కుప్పిలి జగన్ బోడి వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.
.

(Visited 42 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published.