వైకాపా పాలనలో గ్రామాల అభివృద్ధి శూన్యం దారిమల్లించిన 8600కోట్లను తక్షణమే విడుదల చేయాలి పంచాయతి వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకే పంచాయతి నిధులు ధారిమళ్లింపు : మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ
అనకాపల్లి :
రాష్ట్రంలోని పంచాయితీ వ్యవస్థను నిర్వీర్యం చేయడానికే కేంద్ర ప్రభుత్వం పంచాయతీలకు ఇస్తున్న నిధులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దారి మల్లిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇంచార్జి పీలా గోవింద సత్యనారాయణ ఆరోపించారు.వైకాపా పాలనలో గ్రామాల అభివృద్ధిపై చర్చకు సిద్దమా అని ప్రశ్నించారు. కేంద్రం పంచాయతీలకు ఇస్తున్న నిధులు జగన్ రెడ్డి బినామీల జేబుల్లోకి వెళ్తున్నాయని అన్నారు. మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం నినాదానికి వైకాపా పాతర వేసిందని అన్నారు.ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ ను వదిలి గ్రామాలలో పర్యటిస్తే ప్రజలు పడుతున్న భాధలు తెలుస్తాయని అన్నారు.ఈ రోజు అనకాపల్లి పట్టణం,గవరపాలెంలోని స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వైకాపా ప్రభుత్వం దారిమల్లించిన 8600కోట్ల రూపాయలను తక్షణమే ఆయా పంచాయతీలకు విడుదల చేయాలనీ డిమాండ్ చేశారు.జగన్ రెడ్డి పాలనంతా దోచుకోవడం- దాచుకోవడమే అని అన్నారు. పంచాయితీల నిధులు లాగేసుకుంటే గ్రామాల అభిృద్ధి ఎలా సాధ్యం అవుతుందని అన్నారు. నిధుల లేమి వలన గ్రామాలలో పరిశుభ్రత లేక సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయని అన్నారు. గ్రామాలలో బ్లీచింగ్ పౌడర్ కూ కూడ డబ్బులు లేకుండా చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి సిద్ధిరెడ్డి శ్రీనివాసరావు, పచ్చికూరా రాము, మండల తెలుగు యువత అద్యక్షులు మరపురెడ్డి సత్యనారాయణ (ఎమ్ఎస్ఎన్) తదితరులు పాల్గొన్నారు.