వైసీపీ నిజస్వరూపం తేలింది

కార్పొరేటర్ బీశెట్టి వసంతలక్ష్మి

విశాఖపట్నం : జీవీఎంసీ 31వ వార్డులో వైసీపీ అభ్యర్థిని నిలబెట్టడంపై జీవీఎంసీ 33వవార్డు జనసేనపార్టీ కార్పొరేటర్ బీశెట్టి వసంతలక్ష్మి అభ్యంతరం వ్యక్తం చేశారు. మంగళవారం డాబాగార్డెన్స్ వీజేయఫ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. వైసీపీ నమ్మక ద్రోహానికి పాల్పడుతూ 31వవార్డులో అక్రమ పద్దతిలో అభ్యర్థిని నిలబెట్టిందని, వైసీపీ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. స్వతంత్ర అభ్యర్థిగా బిపిన్ కుమార్ జైన్ ఉన్నట్టు ఆర్వో ప్రకటించారని, దీనికి సంబంధించి ముగ్గురు అభ్యర్థుల పేర్లు వారికి కేటాయించిన గుర్తులతో పాటు నోటీసు బోర్డులో ఆర్వో ఫారం 06 ను అతికించారన్నారు. మళ్ళీ గంటల వ్యవధిలోనే స్వతంత్ర అభ్యర్థి బిపిన్ కుమార్ జైన్ ను వైసీపీ అభ్యర్థిగా ప్రకటించి అతనికి ఫ్యాన్ గుర్తు కేటాయించటం దారుణమని మండిపడ్డారు. దీనితో వైసీపీ నిజస్వరూపం తేలిందని పేర్కొన్నారు. దీనిపై జీవీఎంసీ కమిషనర్ కు ఫిర్యాదు చేస్తామన్నారు. వార్డులోని సమస్యల పరిష్కారానికి ఈ నెల 15న జరిగే ఉప ఎన్నికలో జనసేనపార్టీ కార్పొరేటర్ అభ్యర్థి చెరకం పార్వతిని 31వవార్డు కార్పొరేటర్ గా గెలిపించవలసినదిగా కోరారు. ఈ మీడియా సమావేశంలో 31వవార్డు జనసేనపార్టీ కార్పొరేటర్ అభ్యర్థి చెరకం పార్వతి, పార్టీ దక్షణ నియెజవర్గం ముఖ్యనాయకులు గోపికృష్ణ, మూగి శ్రీనివాసరావు, శివప్రసాద్, సురేష్, లుక్స్ గణేష్ తదితరులు పాల్గొన్నారు.

(Visited 130 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *