రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం

గాయాలపాలై చికిత్స పొందుతూ విద్యార్థిని మృతి

విశాఖపట్నం : తెలుగుతల్లి ఫ్లై ఓవర్ పై మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం పాలవగా, తీవ్ర గాయాలు పాలైన విద్యార్థిని చికిత్స పొందుతూ మృతి చెందింది. రెండోవ పట్టణ పోలీసు స్టేషన్ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. విజయనగరం జిల్లా బొబ్బిలి ప్రాంతానికి చెందిన ప్రశాంత్ (22), రైల్వే న్యూకాలనీ ఉంటూ సీతమ్మధారలోని ఫ్యాషన్ వైబ్స్ లో సెలూన్ బోయ్ గా పని చేస్తున్నాడు. ఐ. రాధిక (17) మురళీనగర్ ఎన్జీవోఎస్ కాలనీలో నివాసముంటూ నారాయణ కాలేజీలో ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతుంది. ఇదిలా వుండగా మంగళవారం సాయంత్రం వీరిద్దరూ కలిసి బుల్లెట్ పై ఆశీలమెట్ట నుంచి కంచరపాలెం వైపు ప్రయాణం అయ్యారు. ఈ తరుణంలో తెలుగుతల్లి ఫ్లై ఓవర్ పై వెళ్తూ ఉండగా రోడ్డు పక్కన డివైడర్ను ఢీకొని ఇద్దరు బుల్లెట్ తో పాటు క్రింద పడడంతో ప్రశాంత్ అక్కడికక్కడే దుర్మరణం చెందగా, గాయాలపాలైన రాధికను వెంటనే హాస్పటల్ కు తరలించగా చికిత్స పొందుతూ కొద్ది సేపటికే మృతి చెందింది. ఘటన స్థలాన్ని రెండోవ పట్టణ పోలీసు స్టేషన్ సీఐ కె. వెంకటరావు, ఎస్ఐ లు మన్మధరావు, సల్మాన్ బేగ్ లు పరిలించి కేసును దర్యాప్తు చేస్తున్నారు. వీరిద్దరూ మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యుల రోదనలు ఆసుప్రతి వద్ద మిన్నంటాయి.

(Visited 123 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *