జగనన్న సంపూర్ణ గృహ కు పత్రం లబ్ధిదారులకు అందజేసిన. ఎంపీడీవో సీతయ్య

చింతపల్లి:

జగనన్న సంపూర్ణ గృహ హక్కు(ఓటిఎస్) పథకంలో భాగంగా మండలంలోని చౌడుపల్లి-1సచివాలయం పరిధిలో ఒకేసారి నలుగురు, చింతపల్లి-3 సచివాలయ పరిధిలో ఇద్దరు, అన్నవరం సచివాలయ పరిధిలో ఒకరు చొప్పున గృహ లబ్దిదారులు ఒకేసారి రూ.10 వేల చొప్పున చెల్లించి రుణ విముక్తి పత్రం పొందారని స్థానిక ఎంపిడిఓ లాలం సీతయ్య గురువారం తెలిపారు. వన్ టైమ్ సెటిల్ మెంట్ ద్వారా గృహ విముక్తి పొంది, గృహాన్ని సొంతం చేసుకోవాలన్నారు. అన్నవరం గ్రామ సర్పంచ్ పాంగి సన్యాసి రావు చేతుల మీదుగా ఆ గ్రామ గృహ లబ్దిదారుడు రుణ విముక్తి పత్రం పొందారన్నారు. ఈ కార్యక్రమంలో ఈ ఓఆర్డి, చౌడుపల్లి పంచాయతీ ఓటిఎస్ ప్రత్యేకాధికారి కె శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ కొర్రా లలిత, ఉప సర్పంచ్ రాజేష్, పంచాయతీ కార్యదర్శి వెంకటరమణ, వార్డు మెంబర్ కోరాబు కరుణానిది, సచివాలయ సిబ్బంది గ్రేడ్ -5 కార్యదర్శి గోపినాథ్, డిజిటల్ అసిస్టెంట్ సుమన్ మరియు గ్రామవాలంటీర్లు పాల్గొన్నారు.

(Visited 6 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *