అనకాపల్లి తహశీల్దారు కార్యాలయం లో ఎసిబి అధికారుల తనిఖీలు
అనకాపల్లి :
అనకాపల్లి లో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు అనకాపల్లి తాసిల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోమవారం వచ్చి రికార్డులను పరిశీలిస్తున్నారు మండలంలోని మామిడిపాలెం గ్రామానికి చెందిన ఒక రైతు పట్టాదార్ పాస్ పుస్తకం కోసం దరఖాస్తు చేసుకున్నట్లుగా తెలిసింది కాగా ఆ పాస్ పుస్తకం దరఖాస్తును వీఆర్వో చలపతి రిజెక్ట్ చేసిన ట్లు తెలిసింది దీంతో ఆ రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈరోజు ఉదయం పదకొండున్నరకు ప్రారంభించిన ఈ తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా విఆర్వో చలపతి ఇంటిలో కూడా ఏసీబీ అధికారులు తనిఖీ చేసినట్లు తెలిసింది. అంతేగాకుండా విఆర్ఒ చలపతిని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలిసింది. కాగా బాధిత రైతు మీ సేవలో దరఖాస్తు చేసుకున్న మ్యు టేషన్ ఫైలు తాసిల్దార్ కార్యాలయం లోనూ అటు విఆర్వో చలపతి ఇంటిలోనూ ఏసీబీ అధికారులు వెదికినట్టు తెలిసింది. ఏ కారణం లేకుండా పట్టాదార్ పాస్ పుస్తకం కోసం దరఖాస్తు చేసుకుంటే ఆ దరఖాస్తును విఆర్వో చలపతి రిజెక్ట్ చెయ్యడంతో బాధిత రైతు ఎసిబి అధికారులను ఆశ్రయించాడు. కాగా గతంలో ఎక్కడ తాసిల్దార్ గా పనిచేసిన పాండురంగారెడ్డి హాయంలో విఆర్వో చలపతి పై ఏసీబీ అధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి కానీ బాధితులు చలపతి డబ్బులు డిమాండ్ చేయలేదని చెప్పడంతో చలపతిని ఏసీబీ అధికారులు విడిచిపెట్టారు మరల తాజాగా మామిడిపాలెం గ్రామంలో ఒక రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో మండల అధికారులు తనిఖీలు చేపట్టారు బాధిత రైతు దరఖాస్తు చేసుకున్న ఫైల్ తో పాటు వీఆర్వో నివేదిక అలాగే ఆర్ ఐ నివేదిక పరిశీలించవలసి ఉంటుంది. కాగా పూర్తి వివరాలు తెలియ రావలసి ఉంటుంది. ఇందుకు సంబంధించి వివరాల కోసం వీ డ్రీమ్స్ ప్రయత్నం చేయగా రెవిన్యూ అధికారులు అందుబాటులో లేరు.