అరణ్యరోదనం పుస్తకావిష్కరణ

 


విజ‌య‌న‌గ‌రం: సమాజ హితాన్ని కోరేదే మంచి సాహిత్యమని, మంచి సాహిత్యానికి ప్రజాదరణ ఎప్పుడూ ఉంటుందని ప్రముఖ వైద్యులు డాక్టర్‌ డి వి శ్రీకాంత్‌ అన్నారు. శనివారం ఉదయం తెలుగుభాషా పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో తోటపాలెంలో ఏర్పాటు చేసిన పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగాహాజరై మాట్లాడుతూ సంస్కృతి,సాహిత్యాలకు విజయనగరం పుట్టినిల్లు అని గురజాడ, గిడుగు వంటి మహనీయులు నడయాడిన పట్టణమని అన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ రచయిత పివిబి శ్రీరామమూర్తి రాసిన అరణ్యరోదనం పుస్తకాన్ని తెలుగుభాషా పరిరక్షణ సమితి అధ్యక్షులు సముద్రాల గురుప్రసాద్‌, గంటేడ గౌరునాయుడు, డాక్టర్‌ డివిజి శంకరరావు, నాలుగెస్సులరాజు, మంచుపల్లి శ్రీరాములతో కలసి డాక్టర్‌ డి వి శ్రీకాంత్‌ ఆవిష్కరించారు. 1967 నుండి కథారచనలు ప్రారంభించి నాలుగు వందలకు పైగా కథలను రాసి జిల్లా ఖ్యాతిని ఇనుమడింపచేసిన రచయిత శ్రీరామమూర్తిని అభినందించారు. పుస్తకాన్ని పిఎస్‌ శ్రీనివాసరావు సమీక్షించారు. జిఎస్‌ఎస్‌ఎస్‌ రామకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అలయన్స్‌క్లబ్‌ అంతర్జాతీయ కార్యదర్శి బలిజేపల్లి చక్రధరరావు, కేంద్రసాహిత్య అకాడమీ గ్రహీత బాలసుధకారమౌళి, పి శంకరరావు, ఇందు రమణ, మానాపురం రాజాచంద్రశేఖర్‌, గురుమూర్తి, బెహరా ఉమామహేశ్వరరావు, పి గోపాలకృష్ణ, ఎ.అప్పారావు అతదితరులు పాల్గొన్నారు.

(Visited 42 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published.