ఐ.ఎన్.టి.యూ.సి సమ్మెకు దూరం
ఉక్కునగరం:
విశాఖ ఉక్కు కర్మాగారంలో మెరుగైన వేతన ఒప్పందం కోసం ఉక్కు అఖిలపక్ష కార్మిక సంఘాలు ఈనెల 29వ తేదీన సమ్మె చేస్తాం అని ఈ నెల 15వ తేదీన సమ్మె నోటీసు ను యాజమాన్యం కు ఇవ్వడం జరిగింది.
అయితే ఉక్కు యాజమాన్యం వేతన ఒప్పందం కోసం ఎన్జెసిఎస్(NJCS) సమావేశాలను వర్చువల్ పద్దతిలో ఈనెల 22వ తేదీన ప్రారంభించి వరుసగా ఈనెల 26వ తేదీ వరకూ జరిగాయి.
అయితే ఈ సమావేశం లో అన్ని కార్మిక సంఘాలు 15% ఎంజిబి,35% పెర్క్స్,9% పెన్షన్ కోసం చర్చలు ప్రారంభించగా,
యాజమాన్యం 13% ఎంజిబి ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. అయితే పెర్క్స్ పై చర్చలు జరుగుతున్న నేపధ్యంలో సందిగ్ధత నెలకొంది.
సమావేశాలు అన్నీ వర్చువల్ గా జరుగుతుండడంతో దీనిపై క్లారిటీ రావడం లేదని, ఈనెల 28,29వ తేదీలలో భౌతికంగా(ఫిజికల్ మీటింగ్) గా మీటింగ్ కు హాజరయ్యి వేతన ఒప్పంద చర్చలు ముగిద్దామని యాజమాన్యం తెలియజేసింది.
దీనిపై స్పందించిన సిఐటియూ,ఏఐటియుసి లు ఈనెల 29న సమ్మె కు పిలుపునిచ్చిన నేపద్యంలో ఫిజికల్ మీటింగ్ను మొదటి వారంలో జరపాలని తెలిపారు.
అయితే జాతీయ ఇంటక్ అధ్యక్షులు జి.సంజీవరెడ్డి గారు ఆదేశాల మేరకు విశాఖ ఉక్కులో ఇంటక్ సమ్మెలో పాల్గొనడం లేదని వైజాగ్ స్టీల్ ఇంటక్ అధ్యక్షులు గంధం వెంకటరావు ,జాతీయ కార్యదర్శి మంత్రి రాజశేఖర్ ఈరోజు సెంట్రల్ స్టోర్స్ జంక్షన్ లో జరిగిన కార్యకర్తల సమావేశంలో తెలియజేసారు.
యాజమాన్యం తో ఈనెల 22వ తేదీ నుండి 26వరకూ వర్చువల్ మీటింగ్స్ జరిగాయని, ఇప్పటికి ఎంజిబి పై క్లారిటీ వచ్చిందని, యాజమాన్యం ఈనెల 28,29వ తేదీలలో ఫిజికల్ గా సమావేశం అయ్యి చర్చించి తేల్చుకుందాం అన్నా, ఉక్కులో సిఐటియు మరియు మిగిలిన యూనియన్లు సమావేశాలను ఇప్పుడు వద్దని వచ్చే నెల మొదటి వారంలో జరపాలని కోరాయని, సమ్మెకు వెళ్లడం వల్ల కార్మికులు నష్టపోయే ప్రమాదం వుందని, అయితే వచ్చేనెల మొదటి వారంలో జరిగే సమావేశాలలో వేతన ఒప్పందం ఓ కొలిక్కి వచ్చే అవకాశం వుందని, ఇటువంటి సమయంలో సమ్మె సమంజసం కాదని, జరగబోయే సమావేశాలలో తేలకపోతే సమ్మెకు ఇంటక్ సిద్దమని తెలిపారు.
కార్మికుల ప్రయోజనాల దృష్ట్యా సమ్మెను రెండు వారాలపాటు వాయిదా వేయమంటున్నామని, ఇంటక్ సమ్మె వద్దనడం లేదని,
చర్చలు సగం లో వున్నపుడు సమ్మెవలన కార్మికులు నష్టపోయే ప్రమాదం వుందని,
ఈనెల 29 న జరిగే సమ్మెను రెండు వారాలపాటు వాయిదా వేయాలని ఇంటక్ కోరింది.
కార్మికులకు మేలుజరగాలని రేపు జరిగే సమ్మెకు ఇంటక్ కార్యవర్గం దూరంగా వుంటుందని ఈరోజు జరిగిన విసృత స్దాయి కార్యకర్తల సమావేశంలో నిర్ణయించామని అధ్యక్షులు గంధం వెంకట్రావు తెలియజేసారు