జర్నలిస్ట్ లకు రెండేళ్లుగా అక్రిడిటేషన్ల జారీ లేదు రఘురామ కృష్ణంరాజు తొమ్మిదవలేఖ

న్యూ ఢిల్లీ:

ఆంధ్రప్రదేశ్‌లో జర్నలిస్టులకు రెండేళ్లుగా అక్రిడిటేషన్‌ కార్డులు జారీ చేయడం లేదని నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. ‘నవ ప్రభుత్వ కర్తవ్యాల’ పేరుతో సీఎం జగన్‌కు లేఖలు రాస్తున్న ఎంపీ ఏపీలో జర్నలిస్టుల దుస్థితిపై ఇవాళ తొమ్మిదో లేఖ రాశారు. ‘‘మన మాటలను ప్రపంచానికి చెప్పే వారి మాటలను చెప్పడానికే’’ లేఖ రాస్తున్నట్లు పేర్కొన్నారు. అక్రిడిటేషన్‌ కమిటీలో ఒక్క జర్నలిస్టు లేరని.. ఒక్క సమావేశం జరుపుకోకుండానే కమిటీని రద్దు చేశారని తెలిపారు. కమిటీ రద్దు కూడా పలు నాటకీయ పరిణామాల మధ్య జరిగిందన్నారు. ఒక నిర్ణయం తీవ్ర వివాదానికి కేంద్ర బిందువుగా మారిందని చెప్పారు. కొత్త నిబంధనలతో చాలా మంది అక్రిడిటేషన్‌ కార్డులు పొందలేకపోయారని వివరించారు.


‘అక్రిడిటేషన్‌ కోసం చేసుకున్న సుమారు 40వేల దరఖాస్తులు సమాచార శాఖ వద్ద ఉన్నాయి. 17 వేల దరఖాస్తులు పరిశీలించి 470 కార్డులు జారీ చేశారు. గత ప్రభుత్వంలో జర్నలిస్టుల ఆరోగ్య భద్రతకు స్కీ్మ్‌ ఉండేది. జర్నలిస్టులు రూ.1200 చెల్లిస్తే పటిష్ఠ ఆరోగ్య బీమా కల్పించేది. కరోనాతో మరణించిన జర్నలిస్టులకు చెల్లింపులు జరగలేదు. ఆరోగ్యశ్రీ కింద జర్నలిస్టులకు ఇప్పటి వరకు సాయం చేయలేదు. జర్నలిస్టులకు రూ.50 లక్షల జీవిత బీమా సౌకర్యం కల్పించాలి. జర్నలిస్టులను, మీడియా సిబ్బందిని ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌లో చేర్చాలి
అక్రిడిటేషన్‌, ఆరోగ్యశ్రీ ఆరోగ్య కార్డుపై తక్షణమే నిర్ణయాలు తీసుకోవాలి’’ అని రఘురామ లేఖలో పేర్కొన్నారు.

(Visited 93 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published.