యోగ మనిషి‌ ఆయుష్షు పెరుగుతుంది: ఎంపి సత్యవతి

అనకాపల్లి :

పురావస్తుశాఖ మరియు కేంద్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ7 వ యోగా దినోత్సవ వేడుకలు బొజ్జన్న కొండ ప్రాంగణంలో జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అనకాపల్లి పార్లమెంట్ సభ్యురాలు గౌరవ శ్రీమతి డాక్టర్ వెంకట సత్యవతి ఆమె భర్త డాక్టర్ విష్ణు మూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఈ వేడుకలకు ఆంధ్రరాష్ట్రంలో ఎన్నుకోబడ్డ మూడు ప్రాంతాలలో తన పార్లమెంటరీ నియోజకవర్గంలో గల శంకర గ్రామంలో గల బొజ్జన్నకొండ ప్రాంతాన్ని ఎంచుకోవడం చాలా సంతోషకరమైన విషయమని హర్షం వ్యక్తం చేశారు. యోగా విశిష్టతను మరియు వ్యాధులనివారణలో యోగ ఎంతో ఉపయోగపడుతుందని వైద్య శాస్త్రం కూడా చెబుతోంది అని తెలియజేశారు ప్రాచీన భారత సంస్కృతి,వేద సంస్కృతి నుండి భారతీయ జీవన విధానంలో యోగా ఒక భాగంగా ఉండేది అని తెలిపారు. యోగ ఆరోగ్యానికి రక్షణ కవచం అనే నినాదంతో యోగ ద్వారా ఇమ్యూనిటీ పెంపుపొందుటకు కోసం ప్రజలందరూ కూడా యోగా పాటించాలని ఎంపీ గారు పిలుపునిచ్చారు. ఎంపీ మాట్లాడుతూ ఈ బొజ్జన్నకొండ ని పర్యాటకంగా కూడా అభివృద్ధి చేసి బుద్ధుని యొక్క జీవిత విశేషాలను లైట్అండ్ సౌండ్ షో, త్వరలో ఏర్పాటు అవుతుందని తెలియజేయుటకు చాలా సంతోషిస్తానని పేర్కొన్నారు మరియు పర్యాటక శాఖ వారు ధ్యాన మందిరము మరియు ఇక్కడికి వచ్చే పర్యాటకులకు అన్ని రకాల సౌకర్యాలు త్వరలో ఏర్పాటు చేస్తున్నారని పర్యాటక శాఖను అభినందించారు. ఈ కార్యక్రమంలో పురావస్తు శాఖ ఇంజనీర్ లోక , పురావస్తు శాఖ అసిస్టెంట్ సంజీవభారత్ సీనియర్ కన్జర్వేటివ్ అసిస్టెంట్ శ్రీనివాసరావు యోగా అధ్యాపకులు సుబ్బయ్య శంకరం గ్రామ సర్పంచ్ లక్ష్మీ రామకృష్ణ, వైసిపి నాయకులు పసుపులేటి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు

(Visited 2,905 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published.