వెంక‌ట్రావుకు ఘ‌న నివాళి


ప్రస్తుత పరిస్థితుల్లో జర్నలిస్టు ల సేవలు అమోఘమని అనకాపల్లి ఆర్డీఒ సీతారామారావు అన్నారు. ఇటీవల కరోనా కారణంగా మృతి చెందిన సీనియర్ జర్నలిస్టు, అనకాపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రాపర్తి వెంకట్రావు సంతాప సభలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టు లు తమ ప్రాణాలను పణంగా పెట్టి కరోనా సమయంలో పనిచేస్తున్నారన్నారు. మృదు స్వభావి రాపర్తి వెంకట్రావు మన మధ్య లేడన్న విషయం నమ్మక సఖ్యంగా ఉందన్నారు. ప్రతి ఒక్క జర్నలిస్టు కరొనా జాగ్రత్తలు తీసుకొని పని చెయ్యాలని అన్నారు.దివంగత జర్నలిస్టు రాపర్తి వెంకట్రావు చిత్ర పటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఊ కార్యక్రమంలో అనకాపల్లి పట్టణ సిఇ బాస్కర్,అనకాపల్లి పట్టణ జర్నలిస్టు లు మళ్ల బాస్కరావు,విడివి కొండలరావు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

 

(Visited 281 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *