అందరికీ వ్యాక్సిన్ అందించాలి

విశాఖ ఉక్కు కర్మాగారం లో పనిచేస్తున్న అందరికీ వ్యాక్సిన్ అందించాలని 78 వ వార్డు కార్పొరేటర్  బి గంగారం డిమాండ్ చేశారు. ఈరోజు స్టీల్ ప్లాంట్ సిఐటియు ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ సి.ఎం.డి శ్రీ పీకే రత్ గారిని వారి కార్యాలయంలో కలిసి విశాఖ ఉక్కు కర్మాగారం కోవేట్ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై చర్చించారు. సమావేశం అనంతరం గురజాడ కళాక్షేత్రం వెళ్లి అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా 78 వ వార్డు కార్పొరేటర్ గంగారాం గారు మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందించే విధంగా కృషి చేయాలని ఆయన కోరారు. కొవిడ్ రోగులకు సరైన వైద్యం అందక చాలామంది ఇది తమ విలువైన ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రోగులకు సరైన వైద్యం అందుతున్న నమ్మకాన్ని కలిగిస్తే ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య తగ్గుతుందని ఆయన వివరించారు. ఆ దిశగా స్టీల్ యాజమాన్యం కృషిచేస్తోందని మరింత సమర్థవంతంగా సేవలు అందించాలని ఆయన కోరారు. ఉక్కు నగరం లో శానిటేషన్ ప్రక్రియని మరింత వేగవంతం చేయాలని ఆయన కోరారు.
దీనిపై సి.ఎం.డి గారి స్పందిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను పాటించాల్సిన బాధ్యత మా మీద ఉందని వారి ఆదేశాల మేరకు మేము తగు చర్యలు చేపడుతున్నామని ఆయన వివరించారు. వైద్యం, ఆక్సిజన్ అందించడం వంటి చర్యలను ఇప్పటికే విశాఖ స్టీల్ జనరల్ ఆస్పత్రిలో అందిస్తున్నామని ఆయన అన్నారు. వాటితో పాటుగా గురజాడ కళాక్షేత్రం లో పడకలను మరియు వైద్యాన్ని అందించడానికి తగు చర్యలు తీసుకుంటున్నామని ఆయన అన్నారు. మనందరం కలిసి ఈ మహమ్మారిని అంతమొందించడానికి మీ సహాయం కూడా కావాలని అని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో స్టీల్ గుర్తింపు యూనియన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అయోధ్య రామ్, వైటి దాస్, జె సింహాచలం, బి. అప్పారావు, యు వెంకటేశ్వర్లు, ఆర్ రాజేశ్వర రావు, యు. రామస్వామి, వి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

(Visited 64 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *