ఆంధ్రజ్యోతి పబ్లిషర్ ఇంట్లో విషాదం

                                                        (జి. సాయి ప్రసాద్, హైదరాబాద్)


ఆంధ్రజ్యోతి పబ్లిషర్ కోగంటి శేషగిరి రావు కుమారుడు కోగంటి సతీష్ రోడ్డు ప్రమాదంలో శుక్రవారం మధ్యాహ్నం మృతి చెందారు. సూర్యపేట జిల్లా మునగాల మండలం ముకుందాపురం వద్ద ట్యాంకర్ ను సతీష్ ఉన్న కారు ఢీ కొట్టడంతో కోగంటి సతీష్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్తున్న క్రమంలో ముందుగా వెళ్తున్న ట్యాంకర్ ను గమనించకపోవడంతో ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ముందుగా వెళ్తున్న సిమెంట్ ట్యాంకర్ ను బలంగా ఢీకొట్టడంతో కారు నుజ్జునుజ్జు అయ్యింది. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు మునగాల ఎస్సై శ్రీనివాస్ నాయక్ తెలిపారు. కాగా ఈ ఘటనతో ఏబీఎన్ రాధాకృష్ణ కుటుంబంలో విషాదం నెలకొంది.

(Visited 199 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *