జేసీపై దాడి ఫైర్‌..సీం స్పంద‌న‌..?

స‌మ‌గ్ర నివేదిక ఇవ్వాల‌ని ఆర్డీవోకు క‌లెక్ట‌ర్ ఆదేశం

అన‌కాప‌ల్లి : మాజీ మంత్రి,రాష్ట్ర వైసిపి పార్టీ ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు జిల్లా జాయింట్ కలెక్టర్ తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన విష‌యం తెలిసిందే. ఈ విష‌యంపై సీఎం వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి స్పందించిన‌ట్టు తెలిసింది.పట్టణంలో చాలా ఇళ్లు ,వ్యాపార సముదాయాల భవనాలు ప్రభుత్వ భూములు గా నమోదు అయి ఉండటం వీరిలో చాలా మంది సామాన్య మధ్యతరగకి చెంది ఉండటంతో సుమారు రెండు సంవత్సరాల క్రితం దాడి వీరభద్రరావు 22a నుండి తొలగించి డీ నోటిఫికేషన్ చెయ్యాలని బాధితుల తరపున స్తానిక రెవెన్యూ డివిజన్ అధికారి దృష్టి కి‌ తీసుకువెళ్లారు. దీంతో స్తానిక తహశీల్దారు, ఆర్డీఒ సీతారామారావు లు క్షేత్ర స్థాయిలో విచారణ జరిపి పట్టణంలో ఉన్న ఇళ్లు,వ్యాపార భవనాలు జిరాయితీగా‌ గుర్తిస్తూ తదుపరి చర్యలు నిమిత్తం జాయింట్ కలెక్టర్ కి నివేదికను పంపించారు. అయితే ఏడాదిన్నర క్రితం పంపిన ఫైలు అతీగతీ లేకుండా మూలన పడి ఉండటంపై దాడి వీరభద్రరావు జెసి దృష్టి కి పలుమార్లు తీసుకొచ్చినా ఫలితం లేకపోయింది. దీంతో జిల్లా జాయింట్ కలెక్టర్ తీరుపై దాడి వీరభద్రరావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ విష‌యం ముఖ్యమంత్రి దృష్టికి వెళ్ల‌గా జేసీ వివ‌ర‌ణ కోరిన‌ట్టు తెలిసింది.ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సమగ్ర నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్ అనకాపల్లి ఆర్డీఒ సీతారామారావును ఆదేశించారు.

(Visited 662 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *