250 ఆక్సిజన్ పడకలతో అందుబాటులోకి తేవాలి

సోమ‌వారం ఉదయం అఖిళపక్షం ఆధ్వర్యంలో కోవిడ్ నియమనిబంధనలకు లోబడి ఆందోళన కార్యక్రమం నిర్వహించుట జరిగింది. ఈ ఆందోళన కార్యక్రమంలో వక్తలు ఎన్.టి.ఆర్ ఆసుపత్రిలో ఆక్సిజన్ పడకల సామర్థ్యాన్ని పెంచేందుకు ఎమ్.ఎల్.ఏ మరియు ఎమ్.పీలు తగుచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. దీనితో పాటుగా అతి తక్కువ ఖర్చుతో ఎన్.టి‌.ఆర్ వైద్యాలయంను ఆక్సిజన్ తో కూడిన 250 పడకలను చేయవచ్చునని, 5 కె.ఎల్ సామర్థ్యం కలిగిన ఆక్సిజన్ సిలిండర్ కేటాయించుట ద్వారా 250 పడకలు అందుబాటులోనికి తేవచ్చునని తెలిపారు. దీని కోసం అవసరమైతే అఖిళపక్ష సమావేశం ఏర్పాటు చేస్తే సలహాలు సూచనలు ఇచ్చేందుకు అనకాపల్లి ప్రజా సంఘాలతో కూడిన అఖిళపక్ష సిద్దంగా ఉన్నాయని తెలిపారు. పూర్తిస్థాయి కోవిడ్ ఆసుపత్రిగా ఎన్.టి.ఆర్ ఆసుపత్రిని మార్పు చేసే దిశగా సంబంధించిన రాష్ట్ర స్థాయి అధికారులతో స్థానిక శాసనసభ్యులు మరియు పార్లమెంట్ సభ్యురాలు సంప్రదింపులు చేసి సాధించాలని డిమాండ్ చేసారు.
ఈ కార్యక్రమంలో ప్రజా రాజకీయ వేదిక కన్వీనర్ కనిశెట్టి సురేష్ బాబు వ్యవసాయదారుల సహకార వేదిక అధ్యక్షుడు చదరం నాగేశ్వరరావు, సామాజిక హక్కుల వేదిక కన్వీనర్ రాజాన దొరబాబు, సామాజిక న్యాయవాది శేఖరమంత్రుల సాయి మరియు సామాజిక కార్యకర్త కర్రి రాఘవనాయుడు తదితరులు పాల్గున్నారు.

(Visited 102 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *