రక్తమే నీరు గా మారిపోయేటి వేళ
అనకాపల్లి :
రక్తం పంచుకొని పుట్టిన అక్క మాత్రమే కాదు జీవితంలో కష్టాల నుంచి గట్టెక్కించిన త్యాగ మూర్తి ని బయటకు గెంటేసిన తమ్ముడి దుర్మార్గం ఇది. ఆ తమ్ముడి కొమ్ముకాసి పదవికే మచ్చ తెచ్చిన సర్పంచ్ రాక్షసత్వం కూడా ఇది
వివరాల్లోకి వెళితే…..
ఆస్తి కోసం బంధుత్వం న్ని వదులుకునే రోజులు ఇవి తాజాగా అనకాపల్లి మండలం తగరంపూడి గ్రామంలో ఒకే రక్తం పంచుకుని పుట్టిన అక్క ఆస్తి కోసం ఓ కసాయి తమ్ముడు దాష్టికం ఆలస్యం గా వెలుగులోకి వచ్చింది.తగరంపూడి గ్రామానికి చెందిన గని రెడ్డి రాము ఎలియాస్ రమణమ్మ భర్త చనిపోవడంతో గ్రామంలో కాయగూరలు అమ్ముకుంటు ఒంటరిగా ఉంటుంది. అయితే ఈమెకు ఇద్దరు తమ్ములు ఇదే గ్రామంలో ఉంటున్నారు. రమణమ్మ తండ్రి మరణించడంతో తమ్ములు భాద్యత తన నెత్తిమీద వేసుకుని పెంచి పెద్ద చేసింది. ఒక వైపు తల్లి అనారోగ్యంతో ఉండటం వల్ల రమణమ్మే ఇద్దరి తమ్ముళ్ళు కు పెళ్లి చేసింది.అయితే చిన తమ్ముడు భార్య తన పుట్టింటికి వెళ్లిపోవడంతో ఇద్దరిని కలిపే ప్రయత్నం చేసిన చిన తమ్ముడు బార్యా రావడానికి ఇష్టపడలేదని రమణమ్మ తెలిపింది. దీంతో చిన తమ్ముడు కి ఒక మహిళను ఇచ్చ వివాహం జరిపించామని తెలిపింది. అంతే కాకుండా తన ఇద్దరు తమ్ముళ్లకు చెరొక ఇల్లు కట్టి ఇచ్చానని తెలిపింది. ఈ విషయం గ్రామంలో ప్రతి ఒక్కరికీ తెలుసు అని ఆమె స్పష్టం చేసింది. ఆర్దిక ఇబ్బందులు కారణంగా నేను ఉంటున్న నా ఇల్లును అమ్ముకునే పరిస్థితి రావడంతో ఇదే గ్రామంలో అప్పు ఇచ్చిన వ్యక్తికే నా ఇల్లు ను అమ్ముకోవలసి వచ్చిందని వృద్ధురాలు తెలిపింది. వయస్సు మల్లడంతో అప్పు తీర్చలేనేమో అనే భాదతోనే ఇల్లు అమ్మకం పెట్టానని ఆమె తెలిపింది. అయితే ఈ విషయం తెలుసుకున్న తన చిన తమ్ముడు తాతలు అతని భార్య నాగమణి లు కలిసి నేను ఉంటున్న ఇంటిలోకి దౌర్జన్యం ఈ నెల 9 న తెల్లవారుజామున వచ్చి నన్ను బయటకు ఈడ్చుకు వెళ్లి నా ఇంటికి తాళం కప్ప వేసారని వృద్ధురాలు ఆవేదనను వ్యకం చేసింది. స్దానిక సర్పంచ్ యాదగిరి అప్పారావు 1.5 లక్షల రూపాయలు ఇస్తే ఎటువంటి గొడవ లేకుండా చూసుకుంటానని లేకుంటే నీ ఇల్లు నీకు దక్కదని హెచ్చరించాడని వృద్ధురాలు రాము తెలిపింది. దీంతో గత మూడు రోజులుగా ఇంటి బయటే తిండి తిప్పలు లేకుండా ఉంటున్నాను అని ఆ వృద్ధురాలు ఆవేదనను వ్యక్తం చేసింది. ఈ మేరకు అనకాపల్లి పోలీసులకు పిర్యాదు చేసానని. రూరల్ సిఐ తనకు న్యాయం చేస్తానని చెప్పారని ఆమె తెలిపారు. గతంలో ఒకసారి నేను తినే అన్నంలో విషమ కలిపి చంపేదుకు ప్రయత్నం చేసారని వృద్ధురాలు రాము ఆరోపించారు.తనకు న్యాయం చెయ్యాలని ప్రతి ఒక్కరినీ వేడుకుంటున్నానని ఆమె తెలిపారు. దీనిపై ప్రజా ప్రతినిధులు అధికారులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.