అక్రమ మద్యం పంపిణీ కి అడ్డుకట్ట వేయండి

అన‌కాప‌ల్లి:ఈరోజు ప్రజా సంఘాల ప్రతినిధులు స్థానిక ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉపేంద్ర గారి తో సమావేశమై , మార్చి 10న జరగబోవు విశాఖ గ్రేటర్ జివిఎంసి ఎన్నికలలో అనకాపల్లి జోన్ లో ఐదు వార్డులలో వోటర్లను ప్రలోభాలకు గురి చేయడానికి అక్రమ మద్యం పంపిణీ చేయడానికి చూస్తారని అటువంటి దళారులకు అడ్డుకట్ట వేయాలని, చట్టం దృష్టిలో అందరి నీ సమానంగా చూడాలని, అక్రమ మద్యం వ్యాపారుల వెనుక ఎంత పెద్ద వారు ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ , సిఐకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అని ప్రజాసంఘాల ఐక్యవేదిక కన్వీనర్ బొట్టా చిన్నియాదవ్ తెలిపారు, ఈ కార్యక్రమంలో ప్రేమ్ జనతాదళ్ జాతీయ కార్యదర్శి సూరి శెట్టి రామచంద్ర రావు, లీగల్ అడ్వైజర్ లాయర్ గిలకల భాస్కర్ రావు, యాదవ సంక్షేమ సంఘం నాయకులు పల్లా సత్యఅప్పారావు, కిల్లాడ నూకరాజు, ఇసరపు నాగ అప్పారావు, పిన్నింటి ప్రకాష్, సామాజిక నాయకులు శంకర్ తదితరులు పాల్గొన్నారు, ఈ సందర్భంగా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉపేంద్ర గారు మాట్లాడుతూ, విధి నిర్వహణలో రాజీపడే ప్రసక్తి లేదని ఎన్నికలలో అక్రమ మద్యం పంపిణీ దారులకు అడ్డుకట్ట వేస్తామని ,తప్పు చేస్తే ఎంతటివారినైనా వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు.

(Visited 128 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *