దర్జాగా పక్క రైతు భూముల తాకట్టు తగరంపుడి లో పక్కా దగా వైసీపీ సర్పంచ్ దీ అదే దొంగ దారి

అనకాపల్లి  :

 

 

 

భూముల రెవెన్యూ రికార్డులు, రిజిస్ట్రేషన్ లకు సంబంధించిన అక్రమాలకు అంతు లేకుండా పోతోంది.అక్రమాలకు పాల్పడిన వారిపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకో నందున ల్యాండ్ మాఫియా బరితెగిస్తోంది.అధికారులు భారీ గా లంచాలు గుంజి పలుకుబడి కలవారికి ధనికులకు సహకరిస్తూ అక్రమాలకు సహయపడుతున్నారు‌. తాజాగా తగరంపూడి గ్రామంలో చోటు చేసుకున్న భూ అక్రమాలు వెలుగు చూసాయి. గ్రామంలో సుమారు 50 మంది తమ సర్వే నెంబరు తో రిజిస్ట్రేషన్ కాకపోవడంతో అదే గ్రామానికి చెందిన ఒక రైతు సర్వే నెంబరు వేసి స్థలాలను విక్రయించారు. ఆ మేరకు రిజిస్ట్రేషన్ లు జరిగిపోయాయి. గతంలో ఎలక్ట్రానిక్, ( ఆన్ లైన్ రికార్డులు ) తణిఖీలు చేయకుండా రిజిస్ట్రేషన్ చెయ్యడం వలన సమస్యలు ఎదురౌతున్నాయి.అక్రమాలు భారిన పడిన వారికి న్యాయం చెయ్యవలసిన రెవెన్యూ అధికారులు వారిని ముప్పుతిప్పలు పెడుతున్నారు.

తగరంపూడి గ్రామానికి చెందిన జంపాన త్రిన్నాధ రామ కుమార్ వర్మ కు సర్వే నెంబరు 50 లో 8.20 ఎకరాల భూమి ఉంది. ఆయనకు తెలియకుండా ఈ సర్వే నెంబరు తో గ్రామ కంఠం లోని ఇళ్ల స్థలాలను వేరువేరు వ్యక్తులకు అక్కడి వారు చడీ చప్పుడు లేకుండా విక్రయించే సారు. సుమారు పదేళ్లుగా ఆ గ్రామంలో ఇదే తంతు‌ నడుస్తుంది.ఆ ఒక్క గ్రామమే కాక చాలా గ్రామాల్లో ఇలాగే అసలైన. భూ యజమానులు నష్టపోయి రెవెన్యూ కార్యాలయాలు చుట్టూ తిరగ వలసి వస్తుంది. ఈ భాదితుడు తమ భూమిని అనేక దపాలుగా వేరువేరు వ్యక్తులకు విక్రయించి నట్లు ఈసి ల ద్వారా భాదితుడికి తెలియవచ్చింది. తమ భూమిని విక్రయించాలని అనుకున్నప్పుడు తన రెవెన్యూ ఖాతాలో విస్తీర్ణం తగ్గి పోయినట్లు కనిపించడంతో లబోదిబో అంటూ అనకాపల్లి జిల్లా కలెక్టర్ కి మొర పెట్టుకున్నారు. తగరంపూడి గ్రామ సర్పంచ్ సైతం తన భార్య పేరిట ఇళ్ల‌ స్థలాన్ని సర్వే నెంబరు 50 వేసి తనఖా పెట్టి రెండు బ్యాంకుల్లో సొమ్ము లాగేసాడు.ఇక్కడ బ్యాంకులు, రెవెన్యూ అధికారులు సహాయం లేనిదే సర్పంచ్ అక్రమాలకు పాల్పడ్డాడా అన్నది ప్రధాన ప్రశ్న.ఈ మేరకు భాదిత రైతు జిల్లా కలెక్టర్ కి ఇచ్చిన ఫిర్యాదు లో తగరంపూడి గ్రామ సర్పంచ్ భార్య యాదగిరి లీలా భగవతి పై పిర్యాదు చేసారు.

ఇలాంటిదే ఇంకో అక్రమం ఇటీవల బయటపడింది. కొండుపాలెం సర్వే నెంబరు 2-21 లో‌ సుమారు 0.22 సెంట్లు భూమిని తమ ప్రక్కనే ఉన్న వేరొక రైతు బి సుబ్బారావు భూమి సర్వే నెంబరు వేసి విక్రయించాడు. తన రెవెన్యూ ఖాతాలో గల భూమి లో కొంత భాగాన్ని తనకు తెలియకుండానే వేరొకరికి రిజిస్ట్రేషన్ చేయించి ఇచ్చిన ఫిర్యాదు పై అధికారులు స్పందించలేదు.

మోసాలకు అడ్డు కట్ట :

ఇలాంటి మోసాలు జరుగకుండా రెవెన్యూ శాఖ తాజాగా కొన్ని జాగ్రత్తలు తీసుకుంది. రెవెన్యూ కార్యాలయాలు,మున్సిపల్ కార్యాలయాల్లో గల ఎలక్ట్రానిక్ రికార్డులతో రిజిస్టార్ లు సరి చూసుకుని వాటిలో పేరు ఆధారంగానే రిజిస్ట్రేషన్ లు చేస్తున్నారు. అయితే ఇంత వరకు నష్టపోయిన వారి సమస్యలను పరిస్కరించకపోవడం విచారకరం. అధికారులు చేసే తప్పులకు,అవకతవకలకు అమాయక రైతులు బలౌతున్నారు.

(Visited 769 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published.