చిట్టిబాబా..మ‌జాకా..!

హ్యాట్రిక్‌తో స‌త్తా చాటిన వైనం
కుజ్జిలి స‌ర్పంచ్‌గా వైఎస్సార్‌సీపీ మ‌ద్ద‌తుదారుడు చిట్టిబాబు విజ‌యం
సంబ‌రాలు జ‌రుపుకున్న గిరిజ‌నులు

పాడేరుః అదేనండీ మ‌న చిట్టిబాబు ఉన్నాడు క‌దాండీ..ఈపాలి ఎల‌చ్చ‌న్లో మ‌ళ్లీ మ‌నోడే భారీ మెజార్టీతో గెలిచేశాడండీ…ఔనండీ..అడ‌విత‌ల్లి సాక్షిగా అపురూప విజ‌య‌మండీ. ఇది తొలిసారి కాదండీ…మూడు సార్లు అంటే హ్య‌ట్రిక్ అన్న‌మాటండీ…చిట్టిబాబుదండీ మ‌న ఎజెన్సీ ముఖ ద్వార‌మైన పాడేరు మండ‌లమేనండీ బాబూ..ఉమ్మ‌డి రాజ‌ధానిగా ఏపీ ఉన్న‌ప్పుడు 2017లో స‌ర్పంచ్‌గా ఎన్నిక‌య్యాడండీ…

రాష్ట్రం విడిపోయిన త‌రువాత జ‌గ‌న‌న్న పెట్టిన వైఎస్సార్ సీపీలో చేరాడండీ…మ‌నోడికి పెజ‌ల‌న్నా…పెజ‌ల క‌ష్టాలువిన్నా చ‌లించిపోతాడండీ…అంద‌రూ నా వాల్లే…అంద‌రూ ఆ గిరిమాత ముద్దు బిడ్డ‌ల‌మే అంటాడండీ…క‌ష్టాలు నేనున్నానంటాడండీ…క‌న్నీళ్లు చూస్తే అస్స‌లు మ‌న‌సు ఆగ‌దండీ…బెహ్మాండ‌మైన పెజా నాయ‌కుడండీ బాబూ..ప్రేమ చూపిస్తే..ప్రాణాలిచ్చే మ‌న గిరిపుత్రులు మ‌రి అటువంటి మ‌న చిట్టిబాబును వ‌దులుకుంటారా చెప్పండీ…అక్కున చేర్చుకున్నారండీ…ఈరోజు జ‌రిగిన పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో చిట్టిబాబు కుజ్జిలి స‌ర్పంచ్‌గా పీఠ‌మెక్కించారండి..గ‌తంలో చేసిన ప‌నులే మ‌ళ్లీ న‌న్ను గెలిపించాయ‌ని, నిత్యం ప్ర‌జా సేవ‌కే అంకిత‌మ‌వుతాన‌ని హ్య‌ట్రిక్ సాధించిన మ‌న చిట్టిబాబు ఎంతో న‌మ్ర‌త‌తో..విజ‌య గ‌ర్వం లేని ఓ సామాన్య వ్య‌క్తిలా వీడ్రీమ్స్‌కు ప్ర‌తినిధికి చెప్పాడండీ…మ‌రి ఇటువంటి విలువ‌లున్న వ్య‌క్తులే క‌దాండీ సొసైటీకి కావాల్సింది. చిట్టిబాబు గారూ…మీకు అభినంద‌న‌లు అండీ…ప్ర‌జ‌లు మెచ్చెలా గ్రామాన్ని ఆద‌ర్శ‌వంతంగా తీర్చిదిద్దాల‌ని కోరుకుంటున్నామండీ…. ఆయ్ చిట్టిబాబు గారు ఆల్‌ది బెస్ట్ అండీ…


-విల్లూరి రాముడు, వీడ్రీమ్స్ ప్ర‌త్యేక ప్ర‌తినిధి

(Visited 752 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *