సీఎం అభివృద్ధి ప‌నులే గెలిపిస్తాయి


అన‌కాప‌ల్లి : ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాద్ చేసిన అభివృద్ధి పనులను చూసి తనను గెలిపించాలని అక్కిరెడ్డిపాలెం ఎంపిటీసి అభ్యర్థి గొర్లి సూరిబాబు ఓటర్లను అభ్యర్థించారు. సోమవారం ఆయన గోపాలపురం కాలని, తారకరామ కాలనీ లో ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన‌ వీ డ్రీమ్స్ తో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పధకాలు తనను గెలిపిస్తాయని ధీమా వ్యకం చేసారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి గ్రామ అభివృద్ధి కృషి చేస్తానని అన్నారు. ఎన్నికల ప్రచారంలో మహిళలు, యువకులు నుండి మంచి స్పందన ఉందన్నారు. గతంలో తను సర్పంచిగా పనిచేసిన కాలంలో గ్రామంలో చేసిన అభివృద్ధి తనకు ఎంతగానో ఉపయోగపడిందన్నారు. రోజుల్లో 24 గంటల ప్రజలకు అందుబాటులో ఉంటానని ఎప్పుడు అవసరమైన తన ఇంటికి రావచ్చని‌ అన్నారుఈ ఎన్నికల ప్రచారంలో పోతురాజు మాష్టారు, గోపాలపురం సర్పంచ్ జెర్రి పోతుల లక్ష్మి, ఉప సర్పంచ్ బొబ్బరి శ్రీనివాస్,వార్డ్ సభ్యులు సలాది సత్యవేణి,సేనాపతి రామానాయుడు, గొర్లి రమణ అప్పారావు, బంటు శివ నాయుడు, జెర్రి పోతుల శంకర్,నందారపు కుమారి,నారపిన్ని నూక లక్ష్మి, అక్కిరెడ్డి ధఙ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

(Visited 98 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *