పేదల కోసం ప‌నిచేస్తున్న సీఎం


అన‌కాప‌ల్లి : నిరంతరం పేద ప్రజల సంక్షేమం కోసం జగనన్న పని చేస్తున్నారని అక్కిరెడ్డిపాలెం ఎంపిటీసి అభ్యర్థి గొర్లి సూరిబాబు అన్నారు. ఆదివారం సాయింత్రం ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా క్వారీ కార్మికులను కలసి ప్యాన్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన అభ్యర్దించారు. అమ్మ ఒడి,మహిళలకు చేయుత,రైతు భరోష వంటి సంక్షేమ పధకాలు అందించి జగనన్న పేదలకు సంక్షేమ పధకాలు అందిస్తున్నారన్నారు.పెద్దలు దాడి వీరభద్రరావు ఆశిస్సులతోను,ఎమ్మెల్యే అమర్, పార్లమెంటు సభ్యురాలు సత్యవతి అమ్మ, అనకాపల్లి వైసిపి పార్టీ పార్లమెంటు అధ్యక్షులు దాడి రత్నాకర్ సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని ఓటర్లను అభ్యర్థించారు. ఈ ఎన్నికల ప్రచారంలో వైసిపి‌ నాయకులు కెఎంసి రమణ, బ‌లిరెడ్డి సూరిబాబు, అక్కిరెడ్డిపాలెం శ్రీ‌ను, కె.దుర్గారావు, సాలెపు ఈశ్వ‌ర‌రావు, శ్రీ నూకాంబికా క్వారీ వెల్ఫేర్ అసోసియేష‌న్ అక్క‌రెడ్డిపాలెం నేత‌లు, క్వారీ కార్మికులు పాల్గొన్నారు.

(Visited 83 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *