చిన్నియాద‌వ్‌కు స‌త్కారం

అన‌కాప‌ల్లి :చిన్ని యాదవ్ ను సత్కరించిన మాజీ ఐపియస్ అధికారి జెడి.లక్ష్మీనారాయణ ,అనకాపల్లి పార్లమెంటు సభ్యురాలు సత్యవతమ్మ. నిన్న రాత్రి గాజువాక లో అమ్మ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ట్రస్ట్ పదవ వార్షికోత్సవం సందర్భంగా వివిధ రంగాలలో సేవలందించిన వారికి జరిగిన సన్మాన కార్యక్రమం నకు , ముఖ్య అతిథిగా హాజరైన భారత రిజర్వేషన్ల పరిరక్షణ సమితి జాతీయ ప్రధాన కార్యదర్శి ,ప్రజా సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ బొట్టా చిన్నియాదవ్ ను JD లక్ష్మీనారాయణ ips. మరియు అనకాపల్లి పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి డాక్టర్ సత్యవతమ్మ చేతుల మీదగా సేవా పురస్కార్ జ్ఞాపికతో ఘన సన్మానం చేయడం జరిగినది, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విశాఖ నగర మేయర్ శ్రీమతి గొలగాని హరి వెంకట కుమారి శ్రీనివాస్ దంపతులు, డాక్టర్ విష్ణు మూర్తి గారు, గాజువాక ఎమ్మెల్యే కుమారుడు తిప్పల దేవన్, పలువురు కార్పొరేటర్లు ,అమ్మ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు కాండ్రేగుల అయ్యల నాయుడు ,మల్ల భాస్కర్ , తదితరులు పాల్గొన్నారు అనంతరం, ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా చేతుల మీదగా సుమారు 500 మందికి చీరలు ,దుప్పట్లు, రైతులకు పారలు, గొడుగులు , రగ్గులు అందజేయడం జరిగింది….

(Visited 86 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *