కరోనా మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే

 – ఏఐటీయూసీజిల్లా కార్యదర్శి కోన.లక్ష్మణ
అనకాపల్లి : ఆక్సిజన్ సరఫరా లోపంతో తిరుపతి రుయా ఆస్పత్రిలో మరణాలు సంభవించడం బాధాకరమ‌ని ఏఐటీయూసీజిల్లా కార్యదర్శి కోన.లక్ష్మణ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఏపీలో ఆక్సిజన్ అందక 10 రోజుల్లో 35 మందికి పైగా కరోనా రోగులు మరణించార‌ని, ఆ మ‌ర‌ణాల‌కు ప్ర‌భుత్వ హ‌త్య‌లుగానే భావించాల‌న్నారు. కరోనా రెండో దశ ప్రమాదాన్ని గురించి నిపుణులు, శాస్త్రవేత్తలు, మేధావులు హెచ్చరిస్తున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పట్టడంలేద‌ని విమ‌ర్శించారు.తిరుపతి రుయా ఆస్పత్రిలో జరిగిన ఘటనపై సమగ్ర విచారణ జరిపించాల‌ని ల‌క్ష్మ‌ణ డిమాండ్ చేశారు. అలాగే సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ తిరుపతి వెళ్తుండగా మార్గమధ్యంలో పోలీసులు అడ్డుకొని, అరెస్టు చేయటం అక్రమం అన్నారు.

(Visited 198 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *