కోవిడ్ కేర్ సెంట‌ర్ ప్రారంభం

చింతపల్లి :విశాఖ ఏజెన్సీలో రెండవదశ కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో చింతపల్లి పాడేరు అరకు ముఖ్యమైన ప్రాంతాలలో కోవిడ్ కేర్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని పాడేరు సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి డాక్టర్ వెంకటేశ్వర్ సలిజామల ఆదేశాల మేరకు చింతపల్లిలో కోవిడ్ కేర్ సెంటర్ ను శనివారం పాడేరు రెవెన్యూ డివిజనల్ అధికారిణి లక్ష్మీ శివ జ్యోతి యువ శిక్షణ కేంద్రం (వైటిసి) లో లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె స్థానిక విలేకరులతో మాట్లాడుతూ విశాఖ ఏజెన్సీలో రోజురోజుకు కరోనా మహమ్మారి విజృంభిస్తుందన్నారు. కరోనా బాధితులకు అవసరం మేరకు చింతపల్లిలో 100 పడకల కోవిడత కేర్ సెంటర్ ఏర్పాటు చేశామన్నారు. మండలంలోని సుమారు 708 కేసులు నమోదయ్యాయని, కోవిడ్ కేర్ సెంటర్ లో కింద మూడు గదులలో పురుషులకు, పైన అంతస్తులో మూడు గదులు మహిళలకు, కేటాయించడం జరిగిందన్నారు. విశాఖ ఏజెన్సీ లో అధిక సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయని, కోవిడ్ లక్షణాలు ఉన్న వ్యక్తులకు ఆసుపత్రి కంటే కోవిడ్ కేర్ సెంటర్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. రోజురోజుకు కరోనా వైరస్ కేసులు అధిక సంఖ్యలో నమోదయితే మరిన్ని పడకలు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కోవిడ్ కేర్ సెంటర్ లో నాణ్యమైన భోజన, వసతి సౌకర్యాం కల్పించడం జరుగుతుందన్నారు. కరోనా రోగులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఒక వైద్యాధికారి, ఇద్దరు ఏఎన్ఎం, ఒక స్టాఫ్ నర్స్, ఇద్దరు ఆశా కార్యకర్తలను నియమించడం జరిగిందన్నారు. కోవిడ్ టీకాలు మొదటి దోసు వేసుకున్న వ్యక్తులు 8 వారాల 12 వారాల తర్వాత రెండవ దోసు టీకాలు వేసుకోవాలన్నారు. టికాల దోసులు వేసుకునేందుకు ఏఎన్ఎం, ఆశా, గ్రామ వాలంటీర్ సమాచారం మేరకే ఈ కేంద్రానికి వెళ్లి టీకాలు వేయించుకోవాలన్నారు. కరోనా పరీక్షలు ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేపట్టడం జరుగుతుందన్నారు. ఏఎన్ఎం, ఆశా, గ్రామ వాలంటరీ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో లాలం సీతయ్య, తహశీల్దార్ వివివి గోపాలకృష్ణ, ఈ ఓ పి ఆర్ డి కొరుప్రోలు శ్రీనివాసరావు గ్రామ సచివాలయ సిబ్బంది, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

(Visited 99 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *