తుమ్మపాల లో మళ్లీ ఆకలి చావు …

27 నెలలు కాలంలో 12 మంది మృతి…
నిధులు ఉన్న వేతనాలు ఇవ్వని అధికారులు..
కార్మికుల ఆకలి చావులకు కారణం ఎవరు..???


అనకాపల్లి: అనకాపల్లి వీ వీ రమణ (తుమ్మపాల) చక్కెర కర్మాగారంలో అధికారుల పుణ్యమా అని ఇరవై ఏడు నెలలు కాలంలో 12 మంది కార్మికులు ఆకలిచావులు గురికావడం ఆందోళ‌న క‌లిగిస్తోంది. నిధులు ఉన్నప్పటికీ కార్మికులకు చెల్లించని అధికారులు .గత కొంత కాలంగా కార్మికులు ఆకలి చావులకు గురై మృతి చెందుతున్న సంఖ్య పెరుగుతున్నా ప్ర‌జాప్ర‌తినిధులు ప‌ట్ట‌డం లేదు. 2013 ఏప్రిల్ నుంచి 2018 ఆగస్టు వరకు 29 మంది కార్మికులు మృతి చెందారు . విశాఖ రైతు సమాఖ్య అసమాన పోరాటంతో న్యాయస్థానం ఫ్యాక్టరీ ఎండి పర్సన్ ఇన్చార్జి లకు అరెస్ట్ వారెంట్ జారీ చేస్తామని చెప్పిన నేపథ్యంలో గత ప్రభుత్వం 106 జీవో ప్రకారం30.48 కోట్లు విడుదల చేస్తామని చెప్పడం జరిగింది. హైకోర్టు ఉత్తర్వులను దిక్కరించలేక అయిష్టంగానే15.48 కోట్లు విడుదల చేసి మిగతా బ్యాలన్సు నేటికీ చెల్లించలేదు.

2018 సెప్టెంబరులో77 నెలలు వేతన బకాయిలు కార్మికులకు చెల్లించి యాజమాన్యం నాడు చెల్లించిన వేతనాలలో గతంలో దఫా దఫాలుగా ఇచ్చిన అడ్వాన్సులు4.71 కోట్లు ఆంధ్రా బ్యాంకులో ఉంచింది.2018-19 సీజన్ కసింగ్ నిర్వహించిన 330 ఎంఎంఆర్ కార్మికులకు,92 మంది కాంట్రాక్ట్ కార్మికులకు, చెరకు లోడింగ్ అన్లోడింగ్ చేసిన కళాశాలకు కళాసీలు, బాయిలర్ వద్ద పనిచేసిన దినసరి కూలీలు సుమారు 150 మందికి వేజెస్ నేటికీ చెల్లించలేదు. ప్రస్తుతం నాలుగు కోట్లు నిధులు ఫ్యాక్టరీలో ఉన్నప్పటికీ యాజమాన్యం వేతనాలు చెల్లించకపోవడం తో 2018 సెప్టెంబరు నుంచి నేటి వరకు 12 మంది కార్మికులు అనారోగ్యం బారిన పడి మృతి చెందారు.

శుక్రవారం ఫ్యాక్టరీ కార్మికుడు వసది సత్యనారాయణ(52) మృతి చెందాడు ఇతనికి భార్య, కుమారుడు ఉన్నాడు. వాస్తవానికి పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ వేజస్ ఆఫ్ గ్రావిటీ యాక్ట్ ప్రకారం యాజమాన్యం వద్ద నిధులు ఉండి చెల్లించకపోవడం నేరం. ఇప్పటికే న్యాయస్థానం మొట్టికాయలు వేసింది మళ్లీ కార్మికులు కోర్టుకు వెళితే గతంలో చెల్లించాల్సిన తొమ్మిది శాతం వడ్డీతో పాటు మృతి చెందిన కార్మికులు బాధ్యత వహించాల్సి ఉంటుంది అలాగే యాజమాన్యంపై కేసులు నమోదు అయ్యే అవకాశముందని నేతలు అంటున్నారు. విశాఖ లేబర్ కమిషనర్ , మానవ హక్కుల కమిషనర్ దక్షిణాది రాష్ట్రాల వైస్ చైర్మన్ సునీల్ బాల చార్య యాజమాన్యాన్ని హెచ్చరించినా యాజమాన్యంలో కనీస స్పందన లేదని కార్మికులు వాపోయారు. ఫ్యాక్టరీ కార్మిక యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు నూకేశ్వరరావు , గోవింద రావు మాట్లాడుతూ యాజమాన్యం నిరంకుశ ధోరణితో వ్యవహరిస్తుందని మృతి చెందిన కార్మికులు కారణం గతంలోనూ ప్రస్తుత పనిచేస్తున్న ఎండి లే అని ఆరోపించారు. కార్మికులకు న్యాయస్థానాలు ఆ శ్రమించే స్తోమత లేకపోవడంతో ఎం డి లు ఇస్తాను సారం వ్యవహరిస్తున్నారు. ఎం డి లు వ్యవహార శైలితో ప్రభుత్వానికి స్థానిక ప్రజాప్రతినిధులకు చెడ్డపేరు తెస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం కార్మికులకు అందాల్సిన తక్షణమే చెల్లించి రక్షించాలని లేనిపక్షంలో మరిన్ని ఆకలి చావులు జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఫ్యాక్టరీ నడిపించి ఉపాధి కల్పించాలని విజయవాడలో కమిషనర్ ని కలసిన విన‌తిప‌త్రం

అంద‌జేస్తున్న ఎన్.ఎం.ఆర్. లు

ఆందోళ‌న చేస్తున్న ఉద్యోగ కార్మికులు (ఫైల్‌)

(Visited 479 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *