కొప్పాక ‌రుణం తీర్చుకుంటా

అన‌కాప‌ల్లి : కొప్పాక ప్రజలు నా గెలుపు కోసం వెన్నంటి నిలిచి ఆదరించారని 84వ డివిజన్ తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ శ్రీమతి చిన తల్లి నీలబాబు కొనియాడారు. ఆదివారం సాయింత్రం కొప్పాక వివి రమణ నగర్ లోని విల్లూరి మహాలక్ష్మి నాయుడు ఇంటిలో జరిగిన సన్మాన సభలో ఆమె ముఖ్య అథిదిగా పాల్గొని మాట్లాడారు. ప్రతి ఒక్కరూ నిబద్ధతతో పనిచేసి నా గెలుపుకు కృషి చెయ్యడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా కొప్పాక ప్రజలకు రుణపడి ఉంటానని అన్నారు. గ్రామంలో అందరికీ అందుబాటులో ఉంటు ఎన్నికల్లో ఇచ్చిన హమీలను ఒకొక్కటి అమలు చేసుకుంటూ పోతానన్నారు.గ్రామంలో నిరుద్యోగ సమస్య ఎక్కువుగా ఉండటాన్ని గ్రామ పెద్దలు తీసుకు వచ్చారని వారి వారి‌ అర్హతను బట్టి ఉద్యోగ అవకాశాలు కలగపిస్తానని మాజీ జెట్పిటిసి నీల బాబు అన్నారు.

గ్రామంలో ఆసుపత్రి అవసరం ఉందని యువకులు మా ముందు ఉంచారని తప్పకుండా ఆసుపత్రి నిర్మాణానికి కృషి చేస్తానని అన్నారు. కాలనీ సభ్యులు విల్లూరి మహాలక్ష్మి నాయుడు మాట్లాడుతూ నీలబాబు వ్యక్తిత్వం తెలుసుకుని మేము అందరం కలసి చిన తల్లి కి ఓటు వేసామన్నారు.మా గ్రామ అభివృద్ధి కి సహకరించాలని,యువతకు ఉపాది కల్పించి వారి కుటుంబాలకు బాసటగా నిలవాలని కోరారు. తెలుగుదేశం పార్టీ నాయకులు బోయిన మురళీ మోహన్ మాట్లాడుతూ గ్రామంలో ప్రజలకు, నాయకులకు అందుబాటులో ఉండాలని కోరారు. అనంతరం కార్పొరేటర్ చిన తల్లి కి శాలువా కప్పి అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటీసి సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు మిర్తిపాటి గోపాలరావు, మాజీ సర్పంచ్ వానపల్లి బాబూరావు, దేశం నాయకులు మాదంశెట్టి గణేష్,కోటి,సూరారపు గిరి కుమార్, గొంతిన చిన్న,నాగేశ్వరరావు, గంగరాజు,పీలా బాబ్జీ,కర్రి త్రిన్నాద్,కొణతాల రామచంద్రరావు, మళ్ల శ్రీనివాసరావు, బాబులు,తదితరులు పాల్గొన్నారు.

(Visited 313 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *