శానిటైజర్లు పంపిణీ

అనకాపల్లి: మండలం సత్యనారాయణపురం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో గురువారం మండల విద్యాశాఖ అధికారి డి. దివాకర్, స్థానిక సర్పంచ్ పలకా భాగ్యలక్ష్మి చేతులమీదుగా మండలంలోని పలు పాఠశాలలకు శానిటైజర్ స్టాండ్లు, శానిటైజర్ సామాగ్రి, పారిశుద్ధ్య, పరిశుభ్రత సామాగ్రి, పిల్లలకు మాస్కులు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి దివాకర్ మాట్లాడుతూ పాఠశాలలో పిల్లల ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. కరోనా నుండి రక్షణకు అన్ని జాగ్రత్తలు, చర్యలు చేపట్టామన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కు ధరించేలా, భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకున్నామన్నారు. విద్యతో పాటు పోషకాహారం, మధ్యాహ్న భోజన పథకం నిర్వహణకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. పాఠశాలలో పర్యవేక్షణ పెంచామన్నారు. అందరు విద్యార్థులకు పుస్తకాలు అందేలా చర్యలు చేపట్టామన్నారు. దాదాపుగా అన్ని పాఠశాలలో పారిశుద్ధ్య నిర్వహణకు ఒక వ్యక్తిని నిర్మించి, మరుగుదొడ్ల నిర్వహణ, సురక్షిత తాగునీరు, పరిశుభ్ర వాతావరణంకు కృషి చేస్తున్నామన్నారు. ఉపాధ్యాయులకు కూడా తగు శిక్షణ అందజేసి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించామన్నారు. పాఠశాల నిర్వహణలో అజాగ్రత్తల కి అవకాశం లేకుండా చర్యలు చేపట్టనున్నారు. పంచాయతీ కార్యదర్శి శ్రావణి, కమిటీ చైర్మన్ కోన రాము, సీనియర్ నాయకులు పలకా సత్తిబాబు, జోగా నాగు, చవ్వాకుల ఈశ్వరరావు, పోటుకూరి అప్పలరాజు, ఉపాధ్యాయులు సత్యారావు, ఆనంద్, రాజు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

(Visited 107 times, 2 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *