అనకాపల్లి డిప్యూటీ తహసీల్దారు పై జిల్లా విఆర్ఒ ల సంఘం ద్వజం డిటి వైఖరి మార్చుకోకుంటె ఆందోళనకు దిగుతాం : జిల్లా విఆర్ఒ ల సంఘం అధ్యక్షులు రామకాసు హెచ్చరిక
అనకాపల్లి :
విఆర్ఓలు పై కక్ష సాధింపు చర్యలు చేపడితే సహించేది లేదని అనకాపల్లి జిల్లా వీఆర్వోల సంఘం అధ్యక్షులు సబ్బవరపు రామకాసులు హెచ్చరించారు. మంగళవారం అనకాపల్లి తాసిల్దారు గంగాధర్ రావును ఆయన కలిశారు. వీఆర్వోలపై అనకాపల్లి డిప్యూటీ తాసిల్దార్ శ్రీరామ్ మూర్తి కక్ష సాధింపు చర్యలు పాల్పడుతున్నారని తాసిల్దార్ దృష్టికి తీసుకువెళ్ళారు.టి వెంకుపాలెం విఆర్ఒ గంగరాజు మెడికల్ బిల్లు ఇవ్వకుండా డిటి శ్రీరామమూర్తి తాత్సారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ముడుపుల ఇవ్వందె మెడికల్ బిల్లు చేసేది లేదని తనతో అన్నారని ఈ మేరకు తహసీల్దారు గంగాధరరావు దృష్టికి తీసుకువెళ్ళారు.డిటి శ్రీరామమూర్తి కక్ష సాధింపు చర్యలకు పూనుకుంటున్నారని అన్నారు. ఏ కారణం లేకుండా గంగరాజు ని ఎలా సరెండర్ చేస్తారని రామ కాసులు ప్రశ్నించారు. డిప్యూటీ తహసీల్దారు శ్రీరామమూర్తి ఇంటిలోనే రీ సర్వే పనులను చేసారన్నారు. అక్కడ టి వెంకటపాలెం రీ సర్వే ఫైల్సు అన్ని తనవద్ద ఉంచుకుని ఇప్పుడు కొన్ని పైల్స్ కనిపించలేదని గంగరాజుని సరెండర్ చెయ్యడం ఎంతవరకు కరెక్ట్ అని ఆయన ప్రశ్నించారు.డిటి శ్రీరామమూర్తి కక్ష సాధింపు చర్యలు మానకుంటే ఆందోళన తప్పదని ఆయన హెచ్చరించారు. ఈ మేరకు తహసీల్దారు గంగరాజు జోక్యం చేసుకుని వారికి సర్ది చెప్పారు. ఇటుపై ఇటువంటి తప్పులు జరగకుండా చూస్తానని హమి ఇవ్వడంతో వారు వెనుదిరిగారు. అనంతరం రామ కాసులు వీ డ్రీమ్స్ తో మాట్లాడుతూ విఆర్ఒ లపై అనకాపల్లి డిప్యూటీ తహసీల్దారు శ్రీరామమూర్తి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. ఈ విషయమై అనకాపల్లి తహసీల్దారు గంగాధర్ దృష్టికి తీసుకు వెళ్లమని అన్నారు. ఈ మేరకు ఆయన సానుకూలంగా స్పందించారని ఇటుపై పొరపాటు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటానని ఆయన హమి ఇచ్చారని అన్నారు .
డిప్యూటీ తహసీల్దారు శ్రీరామమూర్తి వివరణ
టి వెంకటపాలెం లో విఆర్ఒ గంగరాజు విదులు సక్రమంగా నిర్వర్తించనందున అనేక సమస్యలు ఎదురయ్యాయి. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న రీ సెట్టిల్మెంట్ సర్వే కు సంబంధించి రైతులకు నోటీసులు జారీ చెయ్యడంలో నిర్లక్ష్య దోరణి వీటిలో ప్రధానమైంది.విఆర్ఒ గంగరాజు సెలవులు ఎక్కువగా పెట్టడం వలన మాకవరంలో రీ సర్వే లో అసాధారణ జాప్యం జరిగింది. ఇలాంటి పలు కారణాలు వల్ల విఆర్ఒ పై తగు చర్యలు తీసుకున్నాము. తాహసిల్దారు కూడా ఇదే రకమైన అభిప్రాయం తో విఆర్ఒ ను సరెండర్ చెయ్యవలసిందిగా ఉన్నతాధికారులకు సమర్పించారు.మెడికల్ బిల్లు,జీతాలు బిల్లు జాప్యం విషయంలో నా ప్రమేయం లేదు అని డిప్యూటీ తహసీల్దారు శ్రీరామమూర్తి వివరణ ఇచ్చారు.