ప్రజల ప్రాణాలతో చెలగాటమాడొద్దు

కోవిడ్ కార‌ణంగా ప్ర‌జ‌లు ల‌క్ష‌ల్లో చ‌నిపోతున్నారు. వారిని ప‌ట్టించుకోకుండా కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నాయ‌ని ఆలిండియా బీసీ ఫెడరేషన్ అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ చైర్మన్ విల్లూరి పైడా రావు,భారత రిజర్వేషన్ల పరిరక్షణ సమితి జాతీయ ప్రధాన కార్యదర్శి బొట్టా చిన్నియాదవ్ లు ఒక సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. ఇంకా ప్రభుత్వాలు ప్రజలతో మైండ్ గేమ్ ఆడుతున్నాయి అని , పాలకులు ప్రకటనలకే పరిమితం అవుతున్నారు తప్ప ఆచరణలోకి రావడంలేదని ఆరోపించారు. ఆక్సిజన్ ప్లాంట్లకు కోట్ల నిధులు విడుదల చేశామని అంటున్నారని ఆ ప్లాంట్లు ఎప్పుడు తయారవుతాయని అప్పటివరకు ప్రజల ప్రాణాలు పరిస్థితి ఏమిటని ధ్వజమెత్తారు. ప్రజలకు కావలసిన కరోనా టెస్టులకు చేసిన వారం రోజుల వరకు రిపోర్టులు రావు ఈలోగా ఊపిరి ఆడక ప్రభుత్వ హాస్పిటల్ కి వెళ్తే ఆక్సిజన్ బెడ్స్ ఉండవు, హాస్పిటల్స్ కు సరిపడా డాక్టర్లు ఉండరు, ప్రజాప్రతినిధులకు చెప్పుకుందాం అంటే అందుబాటులో ఉండరు, కనీసం ఫోన్ కైనా అందుబాటులో ఉంటారు అంటే అది జరగడం లేద‌న్నారు . 104 మీకు ఉపయోగకరంగా ఉంటుందని ముఖ్యమంత్రి గారు చెప్పిన అది ప్రకటనలకే పరిమితమైంది, టెస్టులు లేక వైద్యం అందక ప్రజలు పిట్టల్లా చనిపోతుంటే ప్రభుత్వాలకి చీమకుట్టినట్టు కూడా లేదని ఆరోపించారు. త‌క్ష‌ణం ప్ర‌భుత్వం స్పందించి చ‌ర్య‌లు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

(Visited 237 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *