ఉపాధి కార్మికుల‌కు స‌మ్మ‌ర్ అలవెన్స్ ఇవ్వాలి


జాతీయఉపాధిహామీ పథ‌కంలోపనిచేస్తున్న కూలీలకు పనులు కల్పించకపోతే కనీస వేతనంతోపాటు సమ్మర్ అలవెన్స్ లు కలిపి ఇవ్వాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కోన లక్ష్మణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు .గ్రామీణ ప్రాంతాల్లో కూలీలకు పనులు కల్పించకపోతే ఉపాధి హామీ చట్టం ప్రకారం నిరుద్యోగ భృతి కల్పించాలన్న నిబంధన ఆ చట్టంలో ఉందని గుర్తు చేశారు .ప్రస్తుత కరోనా మహమ్మారి విపత్కర పరిస్థితుల్లో జాబ్ కార్డు ఉన్న ప్రతి ఉపాధి కూలీ కి కనీస వేతనంతో పాటు ప్రత్యేక పరిస్థితులకు కింద సమ్మర్ అలవెన్స్ కలిపి ఇవ్వాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను లక్ష్మణ డిమాండ్ చేశారు. ఇప్పటికే పనులు లేక ఉపాధి కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ముందుచూపు లేని అధికారుల కారణంగా పని ప్రదేశాల్లో కరోనా నిబంధనలు అములు కావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పనిచేస్తున్న కూలీలకు ముందుగా అవసరమైన మాస్కులు, శానిటైజర్ ,అందించి భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకుని ఉంటే బాగుండేది అని అభిప్రాయం వ్యక్తం చేశారు. అధికారులు అలసత్వంతో ఉపాధిహామీ కూలీలు పని లేకుండా చేసి వారి కుటుంబాలను ఆకలితో మార్చడం ఎంత వరకు సమంజసమని ఆ కుటుంబాలకు పూట గడిచేది మార్గం మేదని ప్రభుత్వాన్ని ఆమన నిలదీశారు ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉపాధిహామీ కూలీలను ఆదుకోవడానికి ముందుకు రావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు

(Visited 119 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *