అడుగ‌డుగునా ఆద‌ర‌ణ‌

దాడి జ‌య‌వీర్ ఆధ్వ‌ర్యంలో నీలిమాభాస్క‌ర్ విస్తృత ప్ర‌చారం

80 వ వార్డు వైసిపి అభ్యర్థిని నీలిమాకు హారతి ఇచ్చి ఆశీర్వదిస్తున్న మహిళలు

అన‌కాప‌ల్లి : యువనాయకుడు దాడి జయవీర్ ఆధ్వర్యంలో 80వ వార్డు వైఎస్సార్ సీపీ కార్పొరేట‌ర్ అభ్య‌ర్థి నీలిమాభాస్క‌ర్ ప్ర‌చారంలో దూసుకుపోతున్నారు. చినరామస్వామి గుడి వద్ద నుంచి సాగిన ఈ పర్యటనలో ప్రజలు పూలను జ‌ల్లి నీలిమాని ఆశీర్వదించటంతో పాటు అందరం ఫ్యాన్ గుర్తు పై ఓటు వేసి మెజారిటీతో గెలిపిస్తామ‌ని అడుగ‌డుగునా ప్ర‌జ‌లు మ‌ద్ద‌తు తెలుపుతున్నారు. మేమంతా దాడి కుటుంబంతోనే ఉన్నామ‌ని మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. గడపగడపకూ ప్రచార కార్యక్రమంలో భాగంగా జయవీర్ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. జ‌గ‌న‌న్న ప్రభుత్వంలో ఎలాంటి సమస్యలు లేవని మేము అడగకుండానే జగనన్నే మా సమస్యలు తీర్చుతున్నారని కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలు అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ నాయకులు కర్రి రమేష్, కర్రి మోదినాయుడు ద్వారా తెలుగుదేశం పార్టీ బూత్ ఏజెంట్ కర్రి వరహా నూకరాజు 20 మందితోను,కాండ్రేగుల బుజ్జి ద్వారా తెలుగుదేశం మహిళనేత దొడ్డి పూర్ణ సుమారు 20 మందితోను దాడి జయవీర్ ఆధ్వర్యంలో వై. ఎస్. ఆర్. కాంగ్రెస్ పార్టీలో చేరారు..ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ నాయకులు కొణతాల మురళీకృష్ణ,విల్లూరి శివసూరి, కర్రి శివుడు, కర్రి మోదినాయుడు, పొలిమేర మణి,కె. ఎమ్.నాయుడు, కాండ్రేగుల శ్రీరామ్,కోరుబిల్లి ఆరుద్ర, కోరుబిల్లి పరి,కర్రి అప్పాజీ,కర్రి రమేష్,కర్రి పూర్ణరావు, పిళ్ళా అప్పలనాయుడు, కాండ్రేగుల అప్పారావు, కర్రి సత్యనారాయణ, కర్రి అప్పలనాయుడు, పొలిమేర కాను, పొలిమేర మణి, కాండ్రేగుల బుజ్జి, కాండ్రేగుల సుబ్రహ్మణ్యం, వేగి త్రినాధ్, కర్రి కృష్ణ, కర్రి అచ్చియ్యనాయుడు, కర్రి ఈశ్వరరావు, సూరిశెట్టి అప్పలనాయుడు,విల్లూరి రామక్రిష్ణ, విల్లూరి శేఖర్, విల్లూరి సంతోష్, కొణతాల చందు,పెంటకోట సునీల్ మరియు మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

(Visited 250 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *