అడ్డ‌గోలుగా త‌ర‌లిపోతున్న గ్రావెల్‌

విశాఖ పట్నం : కంచే చేను మేసింది అనే చందంగా తయారైంది మైన్స్ అధికారుల తీరు. వివరాలలోకి వెల్తే గాజువాక మండలం దువ్వాడ సర్వే నెంబరు 141 లో కొందరు మైన్స్ అధికారులు గుట్టు చప్పుడు కాకుండా అడ్డుగోలు అనుమతులు మంజూరు చేసి గత పది రోజులు గా పగలు రాత్రి తేడా లేకుండా వందలాది భారీ లారీలతో గ్రావెల్ తరలించి అమ్మకాలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ సర్వే నెంబరు 141లో పల్లవ రాజు, మొల్లి కనకదుర్గ, ఎస్.ఆర్.ఆర్. ప్రాజెక్ట్ లు గ్రావెల్ తీసేందుకు దరఖాస్తు వేసి ఉన్నారు.. అయితే వీరికి ఎవరికి ఎటువంటి అనుమతులు ఇవ్వలేదు సరికదా వీరి దరఖాస్తులను తిరస్కరణ చేసినట్లు తెలిసింది. ఐతే కొందరు మైన్స్ అధికారులకు ఈ గ్రావెల్ కొండపై కన్ను పడింది.ఇక అంతే ముగ్గురు అధికారులు రంజీత్ రాజ్ అనే వ్యక్తి కి 1.50 హెక్టార్లు టిపి మంజూరు చేసారు. కాగా ఇదే సర్వే నెంబరు లో గతంలో దరఖాస్తు వేసిన ముగ్గురికి ఎటువంటి నోటీసు ఇవ్వకుండానే రంజిత్ రాజ్ కి తాత్కాలిక పర్మిట్ మంజూరు చెయ్యడం పట్ల మెన్స్ అధికారుల పై విమర్శలు వినిపిస్తున్నాయి. ఐ తే ప్రభుత్వ నిభందనలు ప్రకారం ప్రైవేటు పనులకు టిపిలు మంజూరు చెయ్యకూడదు కాని ఇక్కడ అధికారులు ప్రభుత్వ నిబందన లకు పాతరవేసి అడ్డగోలుగా టిపిలు మంజూరు చెయ్యడం విడ్డూరంగా ఉంది.సాధారణంగా తాత్కాలిక పర్మిట్ లు ప్రభుత్వ పనులకు మాత్రమే మంజూరు చేస్తారు. నియమ నిబంధనలను పక్కన పెట్టి ప్రైవేటు వ్యక్తుల చేత సిబ్బంది ఈ విధంగా అధికారులు దోచేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మైన్స్ అధికారులు చెప్పిన దానికి రెవెన్యూ అధికారులు చెప్పిన దానికి అస్సలు పొంతన లేదు.
తక్షణమే ఈ క్వారీ అనుమతులపై సమగ్ర దర్యాప్తు జరపాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి

ఎటువంటి అనుమ‌తులు ఇవ్వ‌లేదు

దువ్వాడ సర్వే నెంబరు 141 గ్రావెల్ త్రవ్వడానికి ఎటువంటి అనుమతులు ఇవ్వలేదని తహశీల్దారు లోకేష్ తెలిపారు. అయితే గతంలో ఒక వ్యక్తి ఎన్ఒసి కోసం దరఖాస్తు పెట్టారని ఆ దరఖాస్తు ని రిజెక్ట్ చేసామని అన్నారు. అయితే ఎడి మైన్స్ విశాఖపట్నం వారు ఒక‌లేఖ పంపారని అన్నారు దువ్వాడ కొండ లెవిలింగ్ కి అనుకూలంగా ఉందని లెవిలింగ్ కి అనుమతులు కావాలని కోరారని‌ ఆయన తెలిపారు ఎటువంటి ఎన్ఒసి ఇవ్వలేదని తహశీల్దారు వీ డ్రీమ్స్ కి‌ తెలిపారు

ఎన్‌వోసీ ఇచ్చారు
గాజువాక తహశీల్దారు సర్వే నెంబరు 141 లో గ్రావెల్ తిసెందుకు ఎన్ ఒ సి‌ఇచ్చారని ఎడి మైన్స్ డివిఎస్ఎన్ రాజు అన్నారు అయితే గతంలో గ్రావెల్ కోసం ఇదే సర్వే నెంబరు మీద దరఖాస్తు చేసుకున్నట్లు మా దృష్టి కి తీసుకురావడంతో టిపిలు నిలుపుదల చేసామని అన్నారు.

 

(Visited 559 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *