సబ్బవరంలో ప్రభుత్వభూమి దర్జాగా కబ్జా


రెవెన్యూ అధికారులే సూత్రధారులు

సబ్బవరం: ప్రభుత్వ భూములను రక్షించి కాపాడాల్సిన రెవెన్యూ అధికారులే , అడ్డగోలుగా కబ్జా కోరులకు సహకరించడం స్థానికంగా విమర్శలు రేకెత్తిస్తోంది. మండల కేంద్రమైన సబ్బవరం సర్వేనెంబర్ 334/1 లో 59 సెంట్లు ప్రభుత్వ పోరంబోకు భూమి ఉంది . అర ఎకరం పైగా ఉన్న ఆ స్థలం పై , ఇటీవల ఫుడ్ కార్పొరేషన్ ఆప్ ఇండియా (ఎఫ్ సిఐ) లో ఉద్యోగ విరమణ చేసిన వ్యక్తి కళ్లు పడ్డాయి. దీంతో ఆ ప్రభుత్వ పోరంబోకు భూమికి ప్రహరీ గోడ నిర్మించేందుకు గత మార్చి నెలలో పూనుకున్నాడు . ఆ విషయం గమనించిన సబ్బవరం మాజీ సర్పంచ్ , ఉప సర్పంచ్ , ప్రస్తుత వార్డు మెంబర్లు , మహిళా వార్డు మెంబర్ భర్త , మూకుమ్మడిగా కలిసి తహసీల్దార్ కు ఫిర్యాదు చేశారు . దీంతో స్పందించిన తహసీల్దార్ 334/1 ప్రభుత్వ స్థలం . ఆ స్థలం నిషేదించిన ప్రభుత్వ భూమి కబ్జా చేస్తే శిక్షార్హులు అని సర్వేనంబర్తో సహా బోర్డు పెట్టారు . ఇంతలో ఏం జరిగిందో ఏమో తెలియదు గానీ రెండు నెలలు గడిచేసరికి ఆ స్థలంలో రెవెన్యూ అధికారులు పెట్టిన బోర్డు కనిపించకుండా చేసి ఆ వ్యక్తి తిరిగి దర్జాగా కబ్జాకు పూనుకున్నాడు . మండల కేంద్రంలో 59 సెంట్ల భూమి సుమారు రూ 10 కోట్ల పైగా విలువ చేస్తుందని దీని వెనుక వీఆర్వోల సంఘం జిల్లా నాయకుడు , ఎమ్మెల్యే బంధువు సూత్రధారిగా కధ నడిపిస్తున్నాడనే విమర్శలు స్థానికంగా వినిపిస్తున్నాయి.

ప్రభుత్వ పోరంబోకు భూమి గా నిర్ధారించి బోర్డు పెట్టిన తహసీల్దార్ కబ్జాదారుల నుంచి ఖాళీ చేయించి , ఆదివారం సంత కొరకు ఆ స్థలాన్ని వినియోగిస్తే బాగుంటుందని స్థానిక ప్రజాసంఘాలు కోరుతున్నాయి . ఇళ్ల స్థలాలు లేని పేదవారికి సెంటు స్థలం కేటాయించని రెవెన్యూ అధికారులు , ఉద్యోగ విరమణ చేసిన వ్యక్తులు కబ్జా చేస్తే ఎలా ఊరుకుంటారని ప్రశ్నిస్తున్నారు . ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేస్తే ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ ఎన్ క్రోచ్ మెంట్ యాక్ట్ (ఏపిఎల్ఈఏ ) 1905 కింద శిక్షార్హులవుతారని చట్టంలో పేర్కొన్న ప్పటికి , ప్రబుద్ధులు అక్రమాలు మానుకోవడం లేదనే వాదనలు కూడా స్థానికంగా వినిపిస్తున్నాయి . ఏది ఏమైనా కబ్జాకు గురవుతున్నా ప్రభుత్వ స్థలాన్ని రెవెన్యూ అధికారులు తమ ఆధీనంలోకి తీసుకొని ప్రజా ప్రయోజనాల కోసం ఉపయోగించాలని స్థానిక ప్రజలు మరోపక్క కోరుతున్నారు . మండల రెవెన్యూ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని, లేని ఎడల కలెక్టర్ కు ఫిర్యాదు చేసేందుకు స్థానికులు సిద్దమౌతున్నారు .

తహసీల్దార్ వివరణ 

సబ్బవరం గ్రామం నడిబొడ్డు లో ఉన్న సర్వేనెంబర్ 334/1 స్థలం ఆక్రమణ కు గురైన విషయాన్ని తహసీల్దార్

రమాదేవి ని వీ డ్రీమ్స్” ప్రతినిధి వివరణ కోరగా మార్చి నెలలో తొలి విడత గోడ కడుతున్నప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేశామని పోలీసుల సహాయంతో ఆ స్థలంలో నిషేదించిన ప్రభుత్వ స్థలంగా బోర్డు పెట్టడం జరిగిందన్నారు . ప్రభుత్వ స్థలం లోకి చొరబడ్డ బాదిరెడ్డి నాగరాజు , రెవెన్యూ ఇన్స్పెక్టర్ రమణను కూడా బెదిరించడం జరిగిందని , దీంతో రెండోసారి కూడా పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు . ఆ స్థలంలో నిర్మాణం జరిగినట్లయితే చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ వివరించారు .

(Visited 1,810 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published.