గురుప్రసాద్‌కు తానా ప్రపంచ తెలుగు మహాకవిసమ్మేళనంలో చోటు

విజ‌య‌న‌గ‌రం : గురుప్రసాద్‌కు ప్రతిష్టాత్మక తానా ప్రపంచ తెలుగు మహాకవిసమ్మేళనంలో చోటు దక్కింది. ఉత్తరఅమెరికా తెలుగు సంఘం(తానా) అధ్యక్షులు తాళ్లూరి జయశేఖర్‌, తానా ప్రపంచ సాహిత్యవేదిక
సమన్వయకర్త చిగురుమళ్ల శ్రీనివాస్‌,సాహిత్య వేదిక నిర్వాహకులు డాక్టర్‌ తోటకూర ప్రసాద్‌, తానా
మహిళా విభాగపు సమన్వయకర్త తూనుగుంట్ల శిరీషల నేతృత్వంలో, ప్రపంచ సాహిత్య వేదిక
ఆధ్వర్యంలో 21 దేశాలలో, 21 సంస్థలతో, 21 గంటల పాటు నిర్విరామంగా ప్రపంచ తెలుగు సాహిత్య
చరిత్రలో అపూర్వమైన అక్షర యజ్ఞం అంతర్జాలంలో ఏప్రిల్‌ 10 మరియు 11 తేదీలలో జరుగనుంది. ఈ
మహాకవిసమ్మేళనంలో విజయనగరం జిల్లాకేంద్రానికి చెందిన ప్రముఖ రచయిత, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర
ప్రభుత్వ తెలుగు భాషా విశిష్ట సేవాపురస్కార గ్రహీత, తెలుగు భాషా పరిరక్షణ సమితి అధ్యక్షులు
సముద్రాల గురుప్రసాద్‌కు చోటు దక్కింది. ఈ సందర్భంగా నిర్వాహకులకు గురుప్రసాద్‌ కృతజ్ఞతలను
తెలిపారు.

(Visited 25 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *