రైతులకు మేలు జరిగేలా సాయం

50 లక్షల మందికి రైతు భరోసా
సీఎం జగన్‌మోహన్‌రెడ్డి
రైతుల సంక్షేమమే ధ్యేయమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. రైతు భరోసా- పీఎం కిసాన్ పంట పెట్టుబడి రెండో విడత సాయాన్ని సీఎం జగన్ ఆన్‌లైన్ ద్వారా మంగళవారం మధ్యాహ్నం ప్రారంభించారు. రూ.1,115 కోట్లను నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేశారు. ఈ పథకం ద్వారా మొత్తం 50.47 లక్షల మంది రైతులకు సాయం అందింది. అదే విధంగా ఇటీవల పట్టాలు పొందిన గిరిజనులకు కూడా రైతు భరోసా సాయాన్ని ప్రభుత్వం అందింది, ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ 50 లక్షల మంది రైతులకు న్యాయం జరుగుతుండడంతో ఎంతో ఆనందంగా ఉందన్నారు. కులం, మతం, పార్టీలు అనే బేధం లేకుండా అందరికీ సాయం అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో ప్రతి మూడు కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ సాయం అందుతుందని పేర్కొన్నారు.
41వేల అటవీ భూముల సాగుదారులకు కూడా
41వేల అటవీ భూముల సాగుదారులకు కూడా సాయం అందిస్తున్న ప్రభుత్వం ఒక్క వైఎస్సార్‌సీపీదేనన్నారు. రాష్ట్రంలో 50 శాతం మంది 1.25 ఎకరాలు లోపు ఉన్నవారేనన్నారు. తొలిసారిగా ఖరీఫ్ ఇన్‌పుట్ సబ్సిడీ ఖరీఫ్ సీజన్‌లోనే ఇస్తున్నామన్నారు. ఉచితంగా ఇప్పటికే బోర్లు, ఉచిత విద్యుత్ అందిస్తున్న ఘనత మాదేనన్నారు. మూడు విడతల్లో ఆందజేస్తున్న సాయాన్ని ఈ రోజు రూ.2000 చొప్పున ప్రతి రైతు ఖాతాల్లో జమ చేస్తున్నామన్నారు. రైతులకుతోడుగా తెలుగుదేశం పార్టీ నేతలు ఆందోళనకు దిగడం ఈ పథకాన్ని డైవర్ట్ చేయడానికేనన్నారు. ఎప్పుడో 16వ తేదీన వర్షాలు పడితే..ఇప్పుడు ఆ ప్రాంతాల్లో ఆందోళనకు దిగడం వెనుక చంద్రబాబు కుట్ర ఉందన్నారు. అవినీతి. వివక్ష లేకుండా రైతులకు సాయం అందిస్తున్నామని సీఎం జగన్ పేర్కొన్నారు. అనంతరం వీడియో కాన్ఫరెన్్సలో ఆయా జిల్లాల కలెక్టర్లు, అధికారులు, రైతులతో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడారు.