ఎమ్మెల్యే గుడివాడ పిలుపుకు భారీ స్పందన


ఆసుపత్రి అభివృద్ధికి సాగర్ సిమెంట్ యాజమాన్యం రూ. 7.50 లక్షలు, చెట్టినాడ్ సిమెంట్ కర్మాగారం యాజమాన్యం రూ. 5 లక్షలు అందజేసింది. అనకాపల్లి లక్ష్మీ నారాయణ నగర్ లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం జరిగిన కార్యక్రమంలో ఆయా సంస్థల ప్రతినిధులు ఆర్థిక సాయం చెక్కులను అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ గారి చేతుల మీదగా శనివారం ఆసుపత్రి సూపర్డెంట్ శ్రావణ్ కుమార్* గారికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ ఆస్పత్రి అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు కసింకోట మండలం లోని బయ్యవరం కు చెందిన సాగర్ సిమెంట్స్ యాజమాన్యం రూ. 7,50,000 ను కసింకోట మండలంలోని తాళ్ళపాలెం కు చెందిన చెట్టినాడు సిమెంట్ కర్మాగారం యాజమాన్యం రూ. 5,00,000 అందజేశారన్నారు. తన తండ్రి గుడివాడ గురునాధరావు పేరిట తాను తన సొంత నిధులు రూ.ఐదు లక్షలతో ప్రారంభమైన ఈ కార్యక్రమానికి మంచి ఆదరణ లభిస్తోందన్నారు. తన విజ్ఞప్తి మేరకు లారెన్స్ సంస్థ ఆసుపత్రి అభివృద్ధికి రూ 5 *లక్షలు ఇచ్చిందన్నారు. రాంకో సిమెంట్ కర్మాగారం యాజమాన్యం ఆసుపత్రికి రూ* 20 లక్షల రూపాయలు అందజేసిందన్నారు. అలాగే ఈ రోజు సాగర్ సిమెంట్స్ రూ. 7.5 లక్షలు, చెట్టినాడు సిమెంట్ కర్మాగారం రూ. 5,00,000 ఇవ్వడం జిగిందని అన్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో 50 ఆక్సిజన్ పడకలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ రోజు రాత్రి నుంచి మరో 25 ఆక్సిజన్ పడకలో అందుబాటులోకి రానున్నాయన్నారు. ఈరోజు నుంచి టెలిమెడిసిన్ సేవలు కూడా అందుబాటులోకి రానున్నాయి. ఫోన్ చేసి తమ వ్యాధి వివరాలు తెలియజేసి నిపుణులైన వైద్యుల సలహాలు తీసుకోవచ్చు అన్నారు. టెలీ మెడిసిన్ సేవలకోసం 040 68179850 కి ఫోన్ చేసి మాట్లాడాలని కోరారు. ఈ సందర్భంగా టెలిమెడిసిన్ గోడ, కరపత్రాలను ఆయన విడుదల చేశారు. సాగర్, చేట్టినాడు కర్మాగారాల యాజమాన్యాలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఆర్డీవో జిక్కుల సీతారామారావు , వైకాపా పట్టణ శాఖ అధ్యక్షులు మందపాటి జానకిరామరాజు , మండల పార్టీ అధ్యక్షులు గొర్లి సూరిబాబు , కసింకోట మండల పార్టీ అధ్యక్షులు గొల్లవిల్లి శ్రీనివాసరావు ,వైకాపా నాయకులు పీలా రాంబాబు, కొణతాల భాస్కర్, పలక రవి, జోనల్ కమిషనర్ పి. శ్రీరామ మూర్తి, సాగర్ ప్రతినిధులు శ్రీనివాస రావు, ప్రసాద్ బాబు, పాండురంగారావు, చేట్టినాడు కర్మాగారం ప్రతిధులు జనార్దన్ రావు, దుర్గాప్రసాద్, సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు.

(Visited 154 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *