తగరంపూడి గ్రామంలో గ్రావెల్ ను అక్రమంగా తరలిస్తున్న గ్రామ సర్పంచ్ యాదగిరి అప్పారావు : దాడి చేసిన విజిలెన్స్ అధికారులు మిషను,రెండు ట్రాక్టర్లు సీజ్
అనకాపల్లి :
మండలంలోని తగరంపూడి గ్రామంలో అధికార పార్టీ సర్పంచ్ యాదగిరి అప్పారావు అక్రమంగా గ్రావెల్ దందా నిర్వహిస్తున్నట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. గత పది రోజులు నుండి రాత్రి వేళ తగరంపూడి సర్వే నెంబరు 60 లో గ్రావెల్ మిషన్ ద్వారా నిత్యం పదుల సంఖ్యలు వాహనాల్లో గ్రావెల్ ని తరలించి సొమ్ము చేసుకటున్నట్లు ఆరోపణలువినిపిస్తున్నాయి.ముందు రోజు విజిలెన్స్ అధికారులు ఇదే గ్రామంలో ఆకస్మికంగా తణిఖీలు చేపడ్టి మిషన్ తో పాటు ట్రాక్టర్ లను అదుపులోకి తీసుకున్నట్లు స్థానికులు చెప్తున్నారు అయితే అంత లోనే అధికార పార్టీ నేతలు ఒత్తిడి కారణంగా వాహనాలను వదిలేసి నట్లు తెలిసింది. దీంతో మనకు అడ్డేంటి అనుకున్నారో లేక అధికార పార్టీ అండ ఉంటుంది అనుకున్నారో తెలియదు గాని మరుసటిరోజు కూడా అక్రమంగా గ్రావెల్ తరలించడం మొదలుపెట్టారు. అంతలోనే మరోసారి విజిలెన్స్ అధికారులకు స్థానికులు మరోమారు పిర్యాదు చేసారు.. వెంటనే మైన్స్ విజిలెన్స్ ఆర్.ఐ.ఆంజనేయులు తో పాటు మరొ మహిళా ఆర్.ఐ లు మంగళవారం సాయింత్రం దాడులు జరిపి గ్రావెల్ ను తీస్తున్న ఇటాచి మిషన్ తో పాటు గ్రావెల్ ను తరలించేందుకు సిద్దంగా ఉన్న రెండు ట్రాక్టర్లను విజిలెన్స్ అధికారులు సీజ్ చేసి స్థానిక విఆర్ఒ శ్రీనివాసరావు కి అప్పచెప్పి నట్లు అయన వీ డ్రీమ్స్ కి తెలిపారు. అలాగే ఎన్ని క్యూబిక్ మీటర్లు గ్రావెల్ ని తరలచారు అనేదానిపై కొలతలు తీసారు సుమారుగా రెండు వేల క్యూబిక్ మీటర్లు వరకు గ్రావెల్ ని తీసి నట్లు అధికారులు అంచనా వేసారు. ఈ మేరకు సుమారుగా పది లక్షల రూపాయలు పెనాల్టీ కట్టవలసి ఉంటుందని మైన్స్ ఆర్ఐ ఆంజినేయులు తెలిపారు. ఈ మేరకు నివేదికను తయారు చేసి ఉన్నతాధికారులకు అందజేస్తామని తెలిపారు.
ఇది ఇలా ఉండగా సీజ్ చేసిన ట్రాక్టర్ లకు స్దానిక విఆర్ఐ ని కాపాలాగా ఉంచగా ట్రాక్టర్ డ్రైవర్లు దౌర్జన్యం గా అక్కడి నుండి ట్రాక్టర్ లను తరలించారు. మరి ఈ ట్రాక్టర్ల యజమానుల పై అధికారులు ఏ చర్యలు తీసుకుంటారో చూడాలి.