పీఆర్సీ పై జగన్ రెడ్డి కపట నాటకాలు

-కొణతాల వెంకటరావు

అన‌కాప‌ల్లి:ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలకు ప్రతి నెల జీతాలు ఇవ్వాలన్న కనీస ఇంగిత జ్ఞానం ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కి లేకుండా పోయిందని ఇది ముమ్మాటికీ ప్రభుత్వ ఉద్యోగుల వ్యతిరేక చర్యని తెలుగుదేశం పార్టీ అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ మీడియా కో ఆర్డినేటర్ కొణతాల వెంకటరావు విమర్శించారు . తిరుపతి పార్లమెంట్ ఎన్నికలను గట్టెక్కించడానికి ఉద్యోగస్తుల పింఛను మరియు జీతాలు పక్కనపెట్టి ముఖ్యమంత్రి గారు కాంట్రాక్టులకు బిల్లు రూపంలో 2800 కోట్లు రూపాయలు అప్పు చేసి వారికి బిల్లుల చెల్లింపులు చూసి వాటి నుండి కమిషన్ రూపంలో వచ్చిన డబ్బులతో తిరుపతి ఎన్నికల్లో ఓటర్ల కు ఎర వేస్తున్నారని వెంకట రావు తెలిపారు. ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలను దగ చేయడం కమిటీలతో కాలయాపన జగన్ రెడ్డి ప్రభుత్వానికి అలవాటుగా మారిందని వెంకటరావు విమర్శించారు. ఉగాది కానుకగా రాష్ట్ర ప్రభుత్వం 11వ పీఆర్సీ వస్తుందని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న ఉద్యోగులకు ఉద్యోగ విరమణ చేయబోయే వారికి ఈ ప్రకటన నిరుత్సాహాన్ని కలిగిస్తుందని వెంకటరావు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో పిఆర్సిని ఎటువంటి కార్యదర్శి నివేదిక లేకుండా తెలుగుదేశం ప్రభుత్వం గతంలో ఆమోదించిందని ఉద్యోగ సంఘాలను ముఖ్యమంత్రి చర్చించి పిఆర్సి వెంటనే విడుదల చేయాలని వెంకటరావు డిమాండ్ చేశారు. ఇప్పటికే పిఆర్సి కమిటీ ఐదుసార్లు పొడిగింపు తరువాత ప్రభుత్వానికి సమర్పించారని కమిటీ నివేదికను విడుదల చేయకుండా మరో కమిటీని నియమించడం ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలను దెబ్బతీయడమేనని వెంకటరావు పేర్కొన్నారు. పదకొండవ పి ఆర్ సి లో పరిశీలించాల్సిన అవకాశాలు ఏమున్నాయని ఫిట్ మెంట్ లో పదకొండవ పిఆర్సి ని ప్రకటించాలని 2018 జూలై 1 నుంచి మోనేటరీ బెనిఫిట్ ఇవ్వాలని ఇక కాలయాపన ఆపి చిత్తశుద్ధిని ప్రదర్శించాలని వెంకటరావు డిమాండ్ చేశారు. తెలంగాణలో కార్యదర్శుల కమిటీ నివేదిక లేకుండానే పదకొండవ పిఆర్సి ని ప్రకటించారని అదే తరహాలోనే పిఆర్సీ అమలు చేయాలి తప్ప ఓడ ఎక్కేవరకు ఓడ మల్లయ్య ఓడ దిగిన తర్వాత బోర్డు మల్లయ్య అన్న చందంగా జగన్ రెడ్డి తీరు ఉందని ఎన్నికలకు ముందు ఉద్యోగుల ఓట్ల కోసం నానా యాగీ చేసి ఒంగి ఒంగి దండాలు పెట్టి దొంగ ముద్దులు పెట్టి ఈ రోజున వారిని నానా హింసలకు గురిచేస్తున్నారని దాచుకున్న పిఎం సొమ్ము గ్రాట్యుటీ రిటైర్డ్ ఉద్యోగులకు సంవత్సరం కాలం అయినా ఇవ్వకపోవడం దుర్మార్గంగా జగన్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తుందని వెంకట రావు విమర్శించారు.

(Visited 119 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *