ఎం ఎస్ ఎం ఇ జాతీయ సభ్యులుగా ఎంపీ సత్యవతి

న్యూఢిల్లీ : నేషనల్ బోర్డ్ ఆఫ్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ సభ్యులుగా అనకాపల్లి పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ బీశెట్టి వెంకట సత్యవతి నియామకమయ్యారు. ఈ మేరకు మైక్రో స్మాల్ మీడియం మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ లో పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసింది. బోర్డు పరిధిలో లోక్ సభ నుంచి ప్రతినిధుల నియామకంపై గతంలో అందిన ఉత్తర్వులు మేరకు ఎంపీ సత్యవతి ని ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఎం ఎస్ ఎం ఇ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ శ్రీవాస్తవ నుంచి పార్లమెంట్ సెక్రటరియేట్ అడిషనల్ డైరెక్టర్ కు ఉత్తర్వులు అందాయి. జాతీయ సభ్యులుగా ఎంపీ సత్యవతిని నియమించడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిన్న మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధికి తగిన కృషి చేస్తానని వెల్లడించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి, పార్లమెంట్ సభ్యులు విజయసాయి రెడ్డి,మిథున్ రెడ్డి లకు కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికే ఎక్స్టర్నల్ ఎపైర్స్ కమిటీ కన్సల్టేటివ్ సభ్యులుగా, కోల్ అండ్ స్టీల్ స్టాండింగ్ కమిటీ సభ్యురాలిగా కొనసాగుతుంది తెలిసిందే.

(Visited 262 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *