అలరించిన సినీసంగీత విభావరి

సంగీత సాహిత్యాలకు పుట్టినిల్లు విజయనగరం అని ప్రముఖ సంఘ సేవకులు (గ్రంధి విష్ణుమూర్తి అన్నారు. శనివారం ఉదయం ఎస్‌ వి ఎన్‌ లేక్‌ ప్యాలెస్‌లో ఘంటసాల సంగీత సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సినీ సంగీత విభావరికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ఘంటసాల, సాలూరు రాజేశ్వరరావు వంటి మహనీయులుపుట్టినిల్లు విజయనగరం అని అన్నారు. అనంతరం వర్ధమాన గాయకులు ఆర్‌ సంగీత్‌ కుమార్‌, జగదీష్‌, శ్రీనివాస్‌,సత్యనారాయణ, ఉమామహేశ్వరి, గిరిజా ప్రసన్న శృతి, సుబ్బలక్ష్మీ అంబిక మధురంగా పాటలను ఆలపించారు.ఇంటింటి రామాయణం, పూజ, రెద్‌, పేమలేఖలు, మూడుముళ్లు, శివరంజని, నాలుగు స్థంబాలాట, రుద్రవీణ, ఓబేబీచిత్రాలలోని పాటలను హృద్యంగా ఆలపించారు. కీబోర్డుపై సోమేష్‌కుమార్‌, రాంబాబు, ప్యాద్స్‌పై నాని, తబలపై శివసహకారాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో ప్రశాంతి సంగీత శిక్షణాలయం వ్యవస్థాపకులు ఎలిశెట్టి రాంబాబు,ఘంటసాల సంగీత సాంస్క లతిక సమాఖ్య వ్యవస్థాపకులు సముద్రాలగురుప్రసాద్‌, ఉపాధ్యక్షులు పిన్నింటిసూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

(Visited 87 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *