నేవీ మారథాన్ కు ఏర్పాట్లు


ఈ నెల 13వ తేదీన జరగనున్న నేవీ మారథాన్ సందర్బంగా నగర పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో నేవీ అధికారుల తో పోలీస్ కమిషనర్ సి.హెచ్ శ్రీకాంత్ శనివారం సమావేశమయ్యారు. సుమారు 20,000 మంది ఈ మారథాన్ లో పాల్గొంటారనే అంచనాల నేపథ్యంలో నేవి మారథాన్ వేదిక, ప్రదేశం, స్టార్టింగ్ పాయింట్, రూట్, మొత్తం కార్యక్రమం పూర్తయ్యేందుకు పట్టే సమయంపై చర్చించారు.మారథాన్ జరుగుతున్న రూట్లలో ఉదయం 9 వరకూ ట్రాఫిక్ నియంత్రణ, నేవీ మారధాన్లో పాల్గొనే వారి వాహనాల పార్కింగ్ మరియు వారి ట్రాఫిక్ క్రమబద్ధీకరణ వంటి పలు అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో పోలీస్ అధికారులు సునీల్ సుమిత్ గరుడ్, అరిఫుల్లా, కే.ఆనంద రెడ్డి, కే.సుబ్రహ్మణ్యం , ఏ.సి.పి లు ఇతర అధికారులు పాల్గొన్నారు.

(Visited 70 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published.