కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి గుర్తుగా 75 రూపాయల నాణెం విడుదల

న్యూ ఢిల్లీ : మే 26

 

దేశంలో రెండు వేల రూపాయల నోట్ల ఉపసంహరణ అనంతరం కొత్తగా 75 రూపాయల నాణెం విడుదల చేయనున్నారు. కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవంపై విపక్షాల రగడ రాజుకు టుండగా మరో వైపు ఈ భవనం గుర్తుగా కొత్తగా రూ. 75 కాయిన్‌ను విడుదల చేయాలని నిర్ణయించింది.నాణానికి ఒక వైపు అశోక స్తంభం సింహ, దాని కింద సత్యమేవ జయతే అని ఉంటుంది.35 గ్రాముల బరువు గల నాణెం నాలుగు భాగాల మిశ్రమంతో తయారు చేశారు.కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి గుర్తుగా రూ.75 నాణెం తయారు చేయడం ఆర్థిక మంత్రిత్వ శాఖ.ఎడమవైపు దేవనాగరి లిపిలో భారత్, కుడి వైపున ఆంగ్లంలో భారత్ అనే పదం రాశారు.

నాణేనికి రూపాయి చిహ్నం, లయన్ క్యాపిటల్ కింద రాసిన అంతర్జాతీయ అంకెల్లో 75 డినామినేషన్ విలువ కూడా ఉంటుంది. నాణేనికి రెండో వైపు పార్లమెంట్ కాంప్లెక్స్ చిత్రం ఉంటుంది.నాణెం 44 మిల్లీమీటర్ల వ్యాసంతో వృత్తాకారంలో ఉంటుంది. ఈ నాణెంలో 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం నికెల్, 5 శాతం జింక్ ఉన్నాయి.కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ప్రారంభించారు.

(Visited 173 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published.