రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయాల్లో నిలిచిపోయిన క్రయ విక్రయాల రిజిష్టేషన్లు
అనకాపల్లి :
రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయాల్లో రిజిష్టేషన్లు నిలిచిపోయాయి. దీంతో క్రయ విక్రయాలు కోసం వచ్చిన కచ్చీ దారులు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొ
న్నారు. ఒక వైపు ఎండ వేడి మరో వైపు రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సర్వర్ పని చెయ్యక పోవడంతో వీరు ఉదయం నుండి కార్యాలయం వద్దే వేచి ఉన్నారు. రాష్ట్రంలో అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ను ఇదే పరిస్థితి నెలకొంది. కొన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అయితే కేవలం ఫొటో వరకు క్యాప్చర్ అవుతున్నాయి కాని ఎండాస్ మెంట్ కాఫీ ప్రింట్ మాత్రం రావడం లేదు.దీంతో చాలా చోట్ల సబ్ రిజిష్టర్ లు తమ సీటులో ఖాలీగా కూర్చొనే పరిస్థితి నెలకొంది. అయితే కార్యాలయాల్లో మాత్రం కచ్చీ దారులతో కిక్కిరిసి ఉన్నాయి. రాష్ట్రంలో విశాఖపట్నం, విజయనగరం,రాజమండ్రి,, కాకినాడ, పశ్చిమ గోదావరి జిల్లా,తూర్పుగోదావరి జిల్లా లో సోమవారం రిజిస్ట్రేషను నిలిచిపోయాయి.ఈ రోజు రాత్రికి సర్వర్ మెరుగుపడే అవకాశం ఉంటుందని మంగళవారం రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరిగే అవకాశం ఉంటుందని అనకాపల్లి సబ్ రిజిష్టర్ వి బసవేశ్వరరావు తెలిపారు.